Skip to main content

కొంకాపల్లి ఎత్తు రోడ్డు వద్ద మోటార్ సైకిల్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్... గోడి యువకుడు అక్కడికక్కడే దుర్మరణం...

 అల్లవరం, విశాఖ సందేసం...అమలాపురం మండలం కొంకాపల్లి ఎత్తు రోడ్డు హెచ్ పి గ్యాస్ సమీపంలో ఏపీఎస్ఆర్టీసీ బస్ మోటార్ సైకిల్ ను ఢీ కొట్టింది. దాంతో మోటార్ సైక్లిస్ట్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మోటర్ సైక్లిస్ట్ అల్లవరం మండలం గోడి నుండి బయలుదేరి వస్తుండగా రేవు దినేష్ కుమార్ వయసు( 28) వస్తుండగా ఎత్తు రోడ్డు వద్ద బస్ ఢీకొని ఈ ఘోర సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ డిపార్ట్మెంట్  అక్కడి నుంచి ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు తరలించారు ఆర్టీసీ బస్సు రాజోలు డిపోకు సంబంధించినది బస్సును అమలాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు  సమాచారం కోసం పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...