Skip to main content

మణికంఠ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ శ్రేణులు....

అల్లవరం, విశాఖ సందేసం....అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామానికి చెందిన కాకిలేటి మణికంఠ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి అమలాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు ముందుకు వచ్చారు. జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మణికంఠ కుటుంబాన్ని శనివారం పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. జనసేన పార్టీ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా బాధిత కుటుంబాలకు అండగా ఉండి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచే పార్టీగా,అన్ని కులాలను ,అన్ని మతాలను సమానంగా గౌరవించడం జనసేన పార్టీ విధానమని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిక్కం భీమేశ్వరరావు,చిక్కాల సతీష్, గండి స్వామి, పినిశెట్టి సురేష్,దంగేటి శ్రీహరి, అరళ్ళపల్లి దుర్గ ప్రసాద్,చిక్కం బన్ను, గొలకోటి వెంకటేష్,కాకిలేటి హరికృష్ణ,తిక్కా బాబ్జి, మంచం బాబి, పోలిశెట్టి బాలు, పరసా శ్రీను,కాకిలేటి రామలింగేశ్వర రావు,కాకిలేటి శ్రీనివాస్, కాకిలేటి సురేష్, వంగా నాయుడు,నల్లా రాము, కటికిరెడ్డి బాబి, పరసా శివ, మోటూరి వెంకటేశ్వరరావు మరియు గ్రామస్తులు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...