అల్లవరం, విశాఖ సందేసం అల్లవరం మండలంలో పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవగుప్తం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సామంతకుర్రు, గురుకుల పాఠశాల (బాలురు)గోడి, గురుకుల పాఠశాల (బాలికలు) గోడి నందు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రుద్రరాజు సీతాపతిరాజు మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ మరియు మోసుగంటి గంగయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. పరీక్ష కిట్లను ట్రస్ట్ ల అధ్యక్షులు రుద్రరాజు రమేష్ రాజు,మోసుగంటి.వెంకటేశ్వరరావు విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు.ట్రస్టు అధ్యక్షులు వెంకటేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి ఇష్ట పడి కష్టపడి బాగా చదువుకుని ఉన్నత స్థాయిలకు చేరుకోవాలని,
పాఠశాలలకు, గ్రామానికి, మండలానికి,జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన విద్యార్ధికి ఏభైవేలు, ద్వితీయ స్థానంనకు నలభై వేలు,తృతీయ స్థానంనకు ముఫ్ఫై వేలు రూపాయలు ప్రోత్సహాలుగా ప్రకటించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ట్రస్టులు చేస్తున్న సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, యమ్.టి.వి.సుబ్బారావు, ముత్యాల ఆనంద నవీన్, కడలి శ్రీ సత్య సాయిబాబు,ఉమ,బత్తుల వెంకటలక్ష్మి, ముమ్మిడివరపు వెంకటేశ్వరరావు,కొప్పిశెట్టి శ్రీనివాస్, కొనుకు రాజకుమార్ మరియు గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Post a Comment