మానవ
సృష్టి కి
మూలం
మహిళ.
మహిళ
ఎక్కడ
ఉంటే
అక్కడ
మంగళ
కరం,
గౌరవ
ప్రదం.
నేడు
మహిళ
అడుగిడని
రంగం లేదు.
చివరకు
గగన తలాన్ని
కూడా తాకిన
మహిళ.
మహిళ
అబల కాదు
సబల.
తన కీర్తిని
తానే చాటు
కోగల సత్తా
మహిళ కే
సొంతం.
నేటి మహిళ
ఇంటికి, వంటకి
మాత్రమే
పరిమితం కాదు,
ఆమె పాత్ర
అపరిమితం,
అప్రతిహతం.
ఆమె లేని
రంగం కానరాదు.
కళా రంగం,
రాజకీయ రంగం,
బోధనా రంగం,
వైద్య రంగం,
విద్యా రంగం,
సేవా రంగం,
నాట్యం,
గానం,
అభినయం,
లాలన
పాలన
ఆలాపన
పర్యవేక్షణ
అధికారిగా
వృత్తి రంగం
ఇక ప్రవృత్తులెన్నో
చెప్పనలవి కాదు.
ఆమె తాకని,
స్పృశించని
అంశం ఉండదు.
మానవ మనుగడ
అంతా మహిళ
తోనే ముడిపడి
ఉంది, అందుకే
మాతృ మూర్తి
అంటాం.
మానవతా విలువలను
కాపాడగల
శక్తి యుక్తులు
కేవలం మహిళకే
సొంతం.
రణ రంగం లో
కూడా నేడు
కాలిడి తన
సత్తా చాటుతోంది.
భారత త్రిదళ్ళా లలో కూడా నేడు
తన పాత్ర
కానవస్తోంది.
ఇది శుభ పరిణామమే.
గతం లో
పురుషాదిఖ్య
ప్రపంచం లో
విసిగి, వేసారి
కాలక్రమేణ
తనని తాను
తీర్చి దిద్దుకుంటూ
తనపై మోపిన
కళo కాలను
అధిగమిస్తూ
తన స్థానాన్ని
తాను పదిల
పరచుకుని
పురుషనికి
ధీటుగా నేడు
నిలబడగలిగి
నేనూ ఏమాత్రం
తీసిపోను,
మహిళ అంటే
మహిమన్వితురాలు
అన్న సమాధానం తో, నేడు అంతర్జాతీయo గా
ప్రపంచ మహిళా
దినోత్సవ
సంబరాలు
జరుపుకోవడం
ముడావాహం,
గమనార్హం.
మహిళా మేలుకో
మేలుకొని
కోలుకుని
నేటి సమాజానికి
ఇంకా నీ
సత్తా ఏమిటో
చాటు.
Dr. నండూరి రామక్రిష్ణ
08.03.2026
Dr. నండూరి రామక్రిష్ణ
08.03.2026

Comments
Post a Comment