Skip to main content

అమలాపురంలో ఘరానా దొంగతనం.... వృద్ధుడిని మోసగించి నగదు దోపిడీ

అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చవటపల్లి సత్యనారాయణ (80) బుధవారం దోపిడీకి గురయ్యారు. బ్యాంకులో రూ.20 వేల పింఛను సొమ్ము విత్ డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న ఆయనను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించారు. ఇంటి వద్దకు చేరుకోగానే, ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోతున్నట్లు నటించి సాయం కోరాడు. ఆయన కాపాడేందుకు వెళ్లగా,మరో వ్యక్తి చాకచక్యంగా ఆయన జేబులోని నగదును తస్కరించి ఇద్దరూ పరారయ్యారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...