Skip to main content

గ్లాకోమా గురించి అవగాహన ర్యాలీ

విశాఖపట్నం 8 మార్చి 2026: 1987లో స్థాపించబడిన LV ప్రసాద్ నేత్ర వైద్య శాల (LVPEI) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు ఒడిశా రాష్ట్రాలలో పటిష్టమైన నెట్ వర్క్ కలిగిన పేరొందిన నేత్ర వైద్యశాల. ప్రపంచ గ్లాకోమా వారోత్సవాన్ని పురస్కరించుకుని, రామకృష్ణా బీచ్ రోడ్‌లోని కాళీమాత గుడి  జంక్షన్ నుండి YVMC వరకు గ్లాకోమా అవగాహన నడకను LV ప్రసాద్ నేత్ర వైద్య శాల (LVPEI) నిర్వహించినది. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది పాల్గొన్నారు. పిన్నలను పెద్దలను ఇరువురిని రహస్యంగా ప్రభావితం చేసే కంటి వ్యాధి గ్లాకోమాపై అందరికి అవగాహన కలిగించుటకు  ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ (LVPEI) తన నెట్‌వర్క్ హాస్పటల్స్ పరిధిలో అనేక కార్యక్రమాలు నిర్వహించుటకు ప్రణాళిక రూపొందించినది. వరల్డ్ గ్లాకోమా అసోసియేషన్ (WGA) మరియు వరల్డ్ గ్లాకోమా పేషెంట్స్ అసోసియేషన్ (WGPA) వారి ప్రేరణతో వరల్డ్ గ్లాకోమా వారోత్సవం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం థీమ్ బాల్య గ్లాకోమా మరియు స్టెరాయిడ్-ప్రేరిత గ్లాకోమ

      గ్లాకోమా కంటికి  ఒత్తిడి పెరగడం వలన  ఉత్పన్నమయ్యే కంటి సమస్య మరియు ఇది ఆప్టిక్ నరాలను దెబ్బతీయటం ద్వారా అంధత్వానికి దారితీస్తుంది. ఈ వ్యాధిని గుర్తించటంలో జాప్యం కారణంగా అంధత్వంకు గురవుతున్నట్లు చెపుతున్నారు.  గ్లాకోమా ఉన్నవారిని వారు అంధులుగా మారటం మొదలైతేనే వ్యాధిని గుర్తించటం జరుగుతుంది.2040 నాటికి గ్లాకోమా రోగుల సంఖ్య 76 మిలియన్ల నుండి 111.8 మిలియన్లకు పెరుగుతుందని ప్రపంచ అంచనాలు చెపుతున్నాయి.  గ్లాకోమా తో బాధపడుతున్న వారు ఆఫ్రికా మరియు ఆసియాలో ఎక్కువగా  ఉన్నారు. మనదేశంలో  సుమారు 12 మిలియన్ల మంది గ్లాకోమాతో బాధపడుతున్నారు,             గ్లాకోమా అవగాహన నడక సందర్భంగా డాక్టర్ శివాని కొడాలి, గ్లాకోమా కన్సల్టెంట్,  GMR వరలక్ష్మి క్యాంపస్‌, విశాఖపట్నం వారు మాట్లాడుతూ  రోగికి సరియైన అవగాహన లేకపోవటం వలన  గ్లాకోమా చాలా ప్రమాదకరమైన పరిస్థితిగా మారుతుంది అన్నారు ఇది లక్షలాది మంది రోగులలో కోలుకోలేని దృష్టి లోపానికి దారితీస్తుంది అని, ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో ముందస్తుగా గుర్తించడం, నివారణ మరియు చికిత్స కీలకమైన అంశాలు"  అన్నారు. రాబోయే కొన్ని దశాబ్దాలలో కంటి గాయాలు బాధాకరమైన గ్లాకోమా లేదా ద్వితీయ గ్లాకోమాకు దారితీయవచ్చు, కాబట్టి మీ కళ్ళను గాయం నుండి రక్షించుకోవడం గ్లాకోమాను నివారించడానికి మరొక మార్గం అన్నారు.

      

      రక్తస్రావం వల్ల పుట్టిన పిల్లలలో బాల్య గ్లాకోమా ఎక్కువగా కనిపిస్తుంది.కళ్ళు పెద్దవిగా లేదా మసకబారడం, కళ్ళు ఎర్రబడటం,కళ్ళు నీళ్ళు కారడం, వెలుగు చూడలేక కళ్ళు మూసు కోవటం వంటి లక్షణాలు కనిపిస్తే నేత్ర వైద్యులను సంప్రదించాలి. శరీరంలోని వివిధ రకాల వ్యాధులకు స్టెరాయిడ్లు ఒక సాధారణ చికిత్స. వాటి విచక్షణారహిత మరియు దీర్ఘకాలిక ఉపయోగం స్టెరాయిడ్-ప్రేరిత గ్లాకోమాకు దారితీస్తుంది.  ఐ డ్రాప్స్ , ఆయింట్‌మెంట్లు, ఇన్హేలర్లు, టాబ్లెట్లు మరియు ఇంజెక్షన్ల వంటి అనేక మందులలో స్టెరాయిడ్లు ఉండవచ్చును ఉండవచ్చు. ఏదైనా రూపంలో స్టెరాయిడ్లను ఉపయోగించే ప్రతి ఒక్కరూ ప్రతి ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు సమగ్ర కంటి పరీక్ష చేయించుకోవాలి.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...