Skip to main content

సర్పంచ్ తోట శ్రీదేవి పాలనలో గోడి గ్రామభివృద్ధి.... గ్రామంలో మీ సేవలు అమోఘం....

 అల్లవరం, విశాఖ సందేసం...గోడి గ్రామపంచాయతీ అభివృద్ధికి మీరు వేసిన బాటలు అమోఘమని పంచాయతీ కార్యదర్శి  నందిక శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని గోడి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు  పంచాయతీ కార్యదర్శి నందిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం గ్రామ సర్పంచ్ తోట శ్రీదేవి, ఉప సర్పంచ్ దెందుకూరి సత్యనారాయణ రాజు (సత్తిబాబు రాజు) పంచాయతీ పాలకవర్గ సభ్యులను పూలదండలు వేసి, మెమొంటోలను అందించి,దుస్సాలువాలుతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా సర్పంచ్ శ్రీదేవి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించానని, గ్రామపంచాయతీ సిబ్బంది, పాలక వర్గ సభ్యులు, గ్రామస్తుల సహాయ సహకారాలతో  గోడి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళమని  సర్పంచ్  శ్రీదేవి నరసింహారావు  అన్నారు.

 ఈ కార్యక్రమంలో తోట నరసింహరావు, ఎంపీటీసీ సభ్యులు కాండ్రేగుల వాణి అచ్యుతం, సి సి ఎఫ్ ఎస్ సి సొసైటీ సభ్యులు మంగం నాగేశ్వరరావు, ఉప్పె శ్రీనివాస్, పంచాయతీ గుమస్తా కుక్కల అనంతరావు, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...