విశ్వవ్యాప్త సేవలు .. దేశ ప్రగతికి సోపానాలు* *కీర్తి ప్రతిష్ట లే ప్రతి ఒక్కరికి శాశ్వతం* *నిష్ణాతులకు విశ్వగురు అవార్డుల ప్రధానం* *సినీ నటుడు రాజీవ్ కనకాల తో పాటు..తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ప్రముఖులు
అది ఎంతోమందికి ఆపన్న హస్తంగా మారుతుందన్నారు.. వివిధ రంగాల్లో సేవలు అందిస్తూ
ఎంతోమందికి సహాయ పడుతున్న నిష్ణాతులను ఎంపిక చేసి వారందరినీ సత్కరించుకోవడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు.. గౌరవ అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ వేర్వేరు రంగాల్లో నిరంతరం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి చేదోడు వాదోడుగా నిలిచే సేవకులతో తాను పురస్కారం స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.. గౌరవ అతిధిలు
.. ఐ ఆర్ ఎస్ కస్టమ్స్ అధికారి రవిశంకర్ మలిశెట్టి.. తుమ్మిడి బ్రదర్స్ అధినేత తుమ్మడి రామ్ కుమార్ లు మాట్లాడుతూ
నిరంతరం సమాజానికి సేవలందిస్తున్న అవార్డు గ్రహీతలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు.. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండి ఇతరులకు సహాయ పడితే అది దేశ ప్రగతికి తోడ్పడుతుందన్నారు.. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఫౌండర్ సీఈవో
డాక్టర్ సత్యవోలు రాంబాబు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా అత్యున్నతమైన సేవకులకు విశ్వగురు అవార్డ్స్ ప్రతి ఏటా అందజేస్తున్నామన్నారు.. దేశవ్యాప్తంగా నిజమైన సేవకులు ఎక్కడ ఉన్నారో అటువంటివారిని తమ సంస్థ సభ్యులు ద్వారా గుర్తించి అవార్డులు అందజేస్తున్నామన్నారు.. తమ సంస్థ అవార్డులు స్వీకరించిన
ఎంతోమంది సేవకులు నేడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న పద్మశ్రీ ..పద్మ విభూషణ్ అవార్డులు కూడా స్వీకరించారన్నారు.. నిజమైన సేవకులను గుర్తించడమే తమ సంస్థ ఏకైక లక్ష్యం అన్నారు.. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు కళాకారులు.. నటీనటులు ఉన్నతాధికారులు ఇలా ఎంతో మందిని విశ్వగురు అవార్డులతో సత్కరించారు.... ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు

Comments
Post a Comment