Skip to main content

అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గిడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..

పి. గన్నవరం, విశాఖ సందేసం...పి.గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చిత్ర పటానికి కూటమి నాయకులు  బుధవారం కృతజ్ఞతా భావంతో  పాలాభిషేకం చేసారు. దశాబ్ద కాలం నుండి అత్యంత అధ్వాన్నంగా ఉన్న ముక్తేశ్వరం- కె.జగన్నాధపురం రహదారని నూతనంగా నిర్మించి అయినవిల్లి మండలంలో అందరి మన్ననలు పొందారు.ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. కూటమి గెలిచాక 18 నెలలో సుమారు రూ.4వందల‌ 70 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్యం, వ్యవసాయం, సీయంఆర్ఎఫ్ తదితర రంగాలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అందరి మనస్సులో  నిలుస్తున్నారు.. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.. గ్రామీణ రహదారుల నుండి.. ప్రధాన రహదారుల వరకూ అన్నిచోట్ల గుంతలు లేని రహదారులు నిర్మాణంలో పి.గన్నవరం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ముందువరుసలో ఉడటం విశేషం అంటున్నా  నియోజకవర్గం ప్రజలు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...