రైల్వే స్టేషన్ జీవియంసి ఓల్డ్ బస్ స్టాప్ లో ఏర్పాటు చేసిన అరకు కాఫీ షాపును సీజ్ చేస్తున్న రైల్వే, ఆర్పీఎఫ్ అధికారులు. ( ఫోటో ) అరకు కాఫీ షాప్ సీజ్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత రైల్వే అధికారులు చర్యలు జీవీఎంసీ రైల్వే నిర్ణయం మేరకు దుకాణం తెరుస్తాం.. లీజు దారు రోహిణి
స్టేషన్ .. మార్చి 8విశాఖ రైల్వే స్టేషన్ బయట గత కొన్ని సంవత్సరాలుగా నిరూపయోగంగా, ఆ సాంఘిక కార్యకలాపాలు నిలయంగా మారిన జీవియంసి పాత బస్ స్టాపును, జీవియంసి అరకు స్టాల్, సహాజ ఉత్పత్తుల కోసం, ఐదు నెలల క్రితమే బి రోహిణి అనే ఆమెకు కేటాయించారు. ఐదు నెలలుగా వారి ఆధీనంలోనే ఉంది. దానికి విద్యుత్ కనక్షన్ వేయడంతో పాటుగా, 

పూర్తి మెరుగులు దిద్దారు.షటర్లు, పెయింట్లు వేయించి, యథా ప్రకారం అద్దెచెల్లిస్తున్నారు. దానిని ప్రారంభించిన తరువాత రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది, ఆర్పీఎఫ్ తో వచ్చి ఏలాంటి నోటిసులు, సమాచారం ఇవ్వకుండా ఈ స్థలం మాదంటూ, అందులో ఉన్న మొత్తం మెటీరియల్ తో సహా షాపును నిర్వాహకురాలు రోహిణి సమక్షంలోనే సీజ్ చేశారు. దీనిపైన రైల్వే, జీవియంసి ఉన్నత అధికారులు ఒక నిర్ణయం తీసుకున్న తరువాత తెరుస్తామని
రోహిణి చెప్పారు.

Comments
Post a Comment