శ్రీ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ముగింపు పై, రామకృష్ణ జయంతోత్సవాలు ముగింపు పై వివేకనంద సంస్థ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివేకానంద సంస్థ 24 సంవత్సరాలుగా నిత్య అన్నదానాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు, 25వ సంవత్సరంలో కూడా అన్నదానాలు ముమ్మరంగా చేయాలని సమావేశంలో సభ్యులందరూ తీర్మానించారు. జయంతోత్సవాలలో విరాళాలు ఇచ్చిన సభ్యులందరినీ యోగ మాస్టర్ గణేష్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోదండరావు గారి చేతుల మీద ఘనంగా సత్కరించారు.శ్రీ స్వామి వివేకనంద సంస్థ నందు 24 సంవత్సరాలుగా, ఫోటోగ్రాఫర్ గా సేవలు అందిస్తున్న రంగాజీని వివేకానంద సంస్థ వారు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ సభ్యులు మరియు మహిళా సభ్యులు పాల్గొన్నారు.
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...


Comments
Post a Comment