వినికిడి లోపం ఆలస్యంగా గుర్తిస్తే మాటల అభివృద్ధి, చదువు, భావోద్వేగ స్థితి, సామాజిక నైపుణ్యాలపై దీర్ఘకాల ప్రభావం పడవచ్చని ఆయన తెలిపారు. పిలిచినప్పుడు స్పందించకపోవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం, అసాధారణ నిశ్శబ్దం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
ప్రతి 1,000 శిశువుల్లో 1–3 మందికి వినికిడి లోపం ఉండే అవకాశం ఉందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. జీవితంలోని మొదటి ఆరు నెలలు భాషా అభివృద్ధికి కీలకమని నిపుణులు పేర్కొన్నారు. నవజాత శిశువులకు చేసే OAE, BERA పరీక్షలు సులభమైనవి, నొప్పిలేనివి మరియు నమ్మదగినవిగా ఉంటాయి.
సమయానికి గుర్తించి చికిత్స, హియరింగ్ ఎయిడ్స్, కోక్లియర్ ఇంప్లాంట్స్, స్పీచ్ థెరపీ ద్వారా పిల్లల విద్యా, సామాజిక అభివృద్ధి మెరుగుపడుతుంది. ప్రతి శిశువుకూ వినికిడి స్క్రీనింగ్ తప్పనిసరి చేయాలని మెడికవర్ హాస్పిటల్స్ పిలుపునిచ్చింది.
---

Comments
Post a Comment