Skip to main content

కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ను కలిసిన ఎంపీ హరీష్ బాలయోగి…

 

అమలాపురం, విశాఖ సందేసం.కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ను, కేంద్ర పౌర విమానయాన మంత్రి రామమోహన్ నాయుడు మరియు శాప్  చైర్మన్ రవి నాయుడులతో కలసి అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి మర్యాదపూర్వకంగా కలిశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో తిరుపతిలో ప్రతిపాదించిన నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్పోర్ట్స్‌ను ప్రపంచ స్థాయి హై-పర్ఫార్మెన్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే అంశంపై చర్చించారు. అలాగే ఖేలో ఇండియా నిధులను త్వరిగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేయాలని మరియు 

క్రీడా, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అరకు వ్యాలీలో అంతర్జాతీయ ట్రైల్ రన్ నిర్వహణను ప్రతిపాదించడం జరిగింది. అదనంగా, డా. బి.ఆర్. అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురంలో జీఎంసీ బాలయోగి స్టేడియానికి ఖేలో ఇండియా పథకం ద్వారా మౌలిక వసతుల మంజూరు చేయాలని కోరడంతో పాటు, ఈ సందర్భంలో మాజీ లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి రానున్న 75వ జయంతిని గురించి చర్చించినట్లు ఎంపీ తెలిపారు. మంత్రి మన్సుఖ్ మాండవీయ సానుకూలంగా స్పందించి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యతతో సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ హరీష్ బాలయోగి వెల్లడించారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...