Skip to main content

శ్రీ వాగ్దేవి పాఠశాలలో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర” శ్రీ వాగ్దేవి పాఠశాలలో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర” జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ పై విద్యార్థులకు అవగాహన....

అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం కమిషనర్ నిర్మల్ కుమార్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వముచే  ప్రతిష్టాత్మకముగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమములో భాగంగా అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని వడ్డిగూడెంలో ఉన్న శ్రీ వాగ్దేవి ఇంగ్లీషు మీడియం స్కూల్ నందు “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్” ( చెత్త రహిత సంస్థలు)అనే ఇతివృత్తంతో విద్యార్థులకు , పట్టణ ప్రజలకు స్వచ్ఛత పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో  ముఖ్యతిధిగా   పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు,

 విద్యా సంస్థలు, హాస్పిటల్స్ ,ఇతర సంస్థలు అన్ని వ్యర్థాల నిర్వహణను సక్రమంగా నిర్వహించి, వ్యర్థ రహిత సంస్థలుగా మార్పు చెందాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్లు నిషేధించాలని సూచించారు. శ్రీవాగ్దేవి విద్యార్థులు ప్రదర్శించిన వేస్ట్ టూ ఆర్ట్ స్టాల్స్ ను కమిషనర్ పరిశీలించి, విద్యార్థులను అభినందించారు. స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న  అందరితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ ను చేయించారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్డీఈఈకె.వి.వి.సత్యనారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ జిల్లా ఇంచార్జి రోహిత్ విద్యానంద్, శ్రీ వాగ్దేవి స్కూల్ డైరెక్టర్ పరసా రామ మూర్తి, ప్రిన్సిపాల్ సిస్టీ శ్రీరామ చంద్ర మూర్తి, మున్సిపల్ సిబ్బంది, స్వర్ణ వార్డ్ ల కార్యదర్శులు, మెప్మా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు .జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ పై విద్యార్థులకు  అవగాహన....



Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...