Skip to main content

బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ఎం.వి.ఆర్*

విశాఖ:అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) మంగళవారం విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయం లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

 రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ వెంకటేశ్వర కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎం.వి.ఆర్‌ తో పాటు సుమారు 100 మంది పైగా అనుచరులు, స్థానిక సర్పంచులు  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

పార్టీ విధానాలు మరియు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై ప్రజల సేవలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరినట్లు ఎం.వి.ఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనకాపల్లి ప్రాంతంలో పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు.

కులమతాలకు అతీతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ, రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని పార్టీ నేతలు స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...