వేదిక: తాడేపల్లిగూడెం ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ‘హానరింగ్ ది వారియర్ విత్ ఇన్’ థీమ్‌తో ఘనంగా నిర్వహణ
తాడేపల్లిగూడెం: స్థానిక ఏఎస్ఆర్ (ASR) హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మరియు ఉమర్ అలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో “హానరింగ్ ది వారియర్ విత్ ఇన్” (Honouring The Warrior Within) అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక సేవ, మహిళా చైతన్యం ప్రతిబింబించేలా రోజంతా వివిధ కార్యక్రమాలు కొనసాగాయి.
నాలుగు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు
ఉదయం సెషన్‌లో భాగంగా బల్లిపాడు, పైడిపర్రు, అత్తిలి మరియు రేలంగి గ్రామాల్లో ఏకకాలంలో ఉచిత మహిళా ఆరోగ్య అవగాహన మరియు హోమియోపతి వైద్య శిబిరాలను నిర్వహించారు. కాలేజీ సిబ్బంది, విద్యార్థులు వందలాది మంది గ్రామీణ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సూచనలు చేశారు. ముఖ్యంగా హెచ్‌బి (Hb%), షుగర్ (RBS), థైరాయిడ్ మరియు లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలను నామమాత్రపు ధరకే అందించి, మహిళల్లో ఆరోగ్య స్పృహ కల్పించారు.
ఐడబ్ల్యూడీ క్యాంపస్ అంబాసిడర్ల’ నియామకంమధ్యాహ్నం కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎంపికైన ‘ఐడబ్ల్యూడీ (IWD) క్యాంపస్ అంబాసిడర్లకు’ అతిథులు గౌరవ సూచికగా ‘వైట్ స్కార్ఫ్‌లు’ (White Scarves) అందజేశారు. వీరు క్యాంపస్‌లో మహిళా భద్రత, న్యాయం మరియు చైతన్యం కోసం ప్రతినిధులుగా వ్యవహరిస్తారని కళాశాల యాజమాన్యం తెలిపింది.అతిథుల ప్రసంగాలు:
ముఖ్య అతిథి శ్రీమతి ఆకుల రామకుమారి మాట్లాడుతూ, మహిళలు ధైర్యం, ఓర్పుతోనే విజయం సాధించగలరని పేర్కొన్నారు. "కష్టాలను తట్టుకుని నిలబడినప్పుడే మహిళలకు అసలైన గుర్తింపు, స్వయం సమృద్ధి లభిస్తాయి. భావి తరాలు ఈ పోరాట పటిమను అలవర్చుకోవాలి" అని పిలుపునిచ్చారు.
శ్రీమతి ఆకుల విమల, డాక్టర్ వి. శోభారాణి వృత్తిపరమైన విలువలు, క్లినికల్ లీడర్‌షిప్ ప్రాముఖ్యతను వివరించారు.
శ్రీమతి కె. మంజుల, డాక్టర్ శ్రీత మహిళలకు ఉండాల్సిన చట్టపరమైన అవగాహన, మానసిక స్థైర్యంపై ప్రసంగించారు.
క్రీడా రంగంలో రాణిస్తున్న శ్రీమతి గోపిశెట్టి ధనలక్ష్మి విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు.
ఘనంగా ముగింపుకార్యక్రమం చివరలో కళాశాల బోధన, బోధనేతర సిబ్బందిని ఘనంగా సత్కరించారు. అనంతరం ‘ఏఎస్ఆర్ కమిట్‌మెంట్ వాల్’పై సంతకాలు చేసి మహిళా గౌరవాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. చివరగా ఏఎస్ఆర్ గారి విగ్రహం వద్ద శాంతికి, విముక్తికి చిహ్నంగా పావురాలను గాలిలోకి ఎగురవేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆనంద కుమార్ పింగళి మాట్లాడుతూ.. సామాజిక సేవను, విద్యా విలువలను మేళవించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశామని, విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధికి ఇటువంటి వేడుకలు దోహదపడతాయని తెలిపారు.
ఇట్లు, ప్రిన్సిపాల్ కార్యాలయం,
ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ,
తాడేపల్లిగూడెం.



Comments
Post a Comment