Skip to main content

లోక్‌సభ స్పీకర్‌పై తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం : వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి*

న్యూఢిల్లీ: పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో స్పష్టం చేశారు. సభలో మాట్లాడుతూ స్పీకర్ పదవికి, పార్లమెంటు సంప్రదాయాలకు ఉన్న గౌరవాన్ని కాపాడటం కోసమే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తమ పార్టీ ఏ కూటమికీ చెందినది కాదని, తాము ఎన్డీయే కూటమిలోనూ లేమని, ఇండియా కూటమిలోనూ లేమని ఆయన పేర్కొన్నారు. సభ గౌరవం, స్పీకర్ స్థానం పరిరక్షణ దృష్ట్యా ఈ విషయంలో తాము స్పష్టమైన వైఖరి తీసుకున్నామని చెప్పారు.

స్పీకర్ పదవి రాజకీయ పదవి కాదని, అది రాజ్యాంగబద్ధమైన పదవని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఆ కుర్చీకి ప్రతి సభ్యుడు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజలకు మేలు జరిగే అంశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తమ పార్టీ సమర్థిస్తుందని, అదే సమయంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు. స్పీకర్ తీసుకునే ప్రతి నిర్ణయం అందరికీ నచ్చకపోవచ్చు కానీ అవన్నీ పార్లమెంటరీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని చెప్పారు. సభ సజావుగా నడవాలంటే స్పీకర్ స్థానాన్ని గౌరవించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను లోక్‌సభలో లేవనెత్తడానికి గౌరవ స్పీకర్ శ్రీ ఓం బిర్లా తగిన అవకాశాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అందువల్ల స్పీకర్‌పై ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాము వ్యతిరేకిస్తున్నామని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. సభ హుందాతనాన్ని, పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...