Skip to main content

కిడ్నీ వ్యాధులపై విస్తృత అవగాహన అవసరం --అవయువదానంపై ప్రజలకు తెలియజేయండి --విమ్స్‌లో జీవన్‌ధాన్‌ ఆధ్వర్యంలో కిడ్నీ దినోత్సవం --పాల్గొన్న ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్‌ రవిరాజు, విమ్స్‌ డైరెక్టర్‌ రాంబాబు

విశాఖపట్నం,మార్చి12: జీవనశైలి, ఇతర ఆహారపు అలవాట్ల కారణంగా అధికమవుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులంతా సకాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, ప్రాధమిక దశలోనే వ్యాధిని గుర్తించాలని ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ మాజీ వీసీ, ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్‌ టివి రవిరాజు అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం విమ్స్‌ ఆసుపత్రిలో రాష్ట్ర జీవన్‌ధాన్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.రాంబాబు పర్యవేక్షణలో నగరంలోని పలు జీవన్‌ధాన్‌ పధకం అమలు చేస్తున్న ఆసుపత్రుల సీఈవో్లు, కో-ఆర్డినేటర్లు, ఇతర వైద్యసిబ్బందితో కలసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్‌ టివి రవిరాజు మాట్లాడుతూ రోజురోజుకి పెరుగుతున్న కిడ్నీ వ్యాధి, వాటి నివారణ చర్యలపై గ్రామ స్ధాయి నుంచి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కిడ్ని ట్రాన్స్‌ఫ్లాంటేషన్‌ కోసం గతంలో చాలా మంది ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం జీవన్‌ధాన్‌ పధకం ఏపీలో పక్కగా అమలువుతున్న నేపధ్యంలో కొంత మేర కిడ్నీ రోగులకు సకాలంలో ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేస్తున్నారన్నారు. జీవన్‌ధాన్‌ పధకాన్ని దేశంలోనే టాప్‌ -6లో నిలిపిన డాక్టర్‌ రాంబాబు సేవలను ప్రశంసించారు. ప్రపంచ దేశాల్లో 850 మిలియన్‌ ప్రజలు ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, మన దేశంలో 115 మిలియన్‌ ప్రజలు బాధితులుగా ఉన్నారన్నారు. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ద్వారా రోగులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలందిస్తున్నామన్నారు. రాష్ట్ర జీవన్‌ధాన్‌ కో-ఆర్డినేటర్‌, విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు మాట్లాడుతూ అవయువదానంపై ప్రజలకు అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను సైతం భాగస్వామ్యం చేస్తూ బ్రెయిన్‌డెడ్‌ అయిన రోగుల నుంచి అవయువాలను సేకరిస్తూ, కిడ్నీ ట్రాన్స్‌ఫ్లాంటేషన్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవన్‌ధాన్‌ పధకానికి సంబంధించి కూడా అన్ని రకాల సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కెవిఎస్‌ఎం సంధ్యాదేవి, కేజీహెచ్‌ సూపరిండింటెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి, కిమ్స్‌ ఆసుపత్రి రీజనల్‌ హెడ్‌ నాగేశ్వరరావు,కేర్‌ ఆసుపత్రి సీఈవో సొదన్‌ కుమార్‌, అపోలో ఆసుపత్రి సీఈవో కృష్ణ ప్రసాద్‌, సివెన్‌హిల్స్‌ సీఈవో గిరిబాబు, మెడికవర్‌ ఆసుపత్రి సీఈవో నరేంద్ర బెండితో పాటు పలువురు నెఫ్రాలజిస్టులు, ఇతర జీవన్‌ధాన్‌ కో-ఆర్డినేటర్లు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...