Skip to main content

ఆస్తి పన్నుల రివిజన్ పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించండి. -  జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్  

విశాఖపట్నం, మార్చి 6: రెవిన్యూ విభాగానికి సంబంధించిన ఆస్తి పన్నుల రివిజన్ పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జోనల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ సమావేశ మందిరం నుండి రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఈ ఆర్ పి లపై అందరు జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ రెవెన్యూ విభాగానికి సంబంధించిన అన్ని జోన్లలో ఉన్న ఈ ఆర్ పి లను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాల పన్నుల మదింపు మొదలైన వాటి విషయాలలో అధికారులు ఆస్తులకు సంబంధించిన ప్లాను, దస్తావేజులు, ఆయా ప్రాంతాలు, ఆస్తుల పరిశీలన క్షుణ్ణంగా జరపాలన్నారు. ఈ ఆర్ పి లో పెట్టుకున్న దరఖాస్తులకు సంబంధించి ఆస్తి పన్నుల తగ్గింపు, సర్దుబాట్లు, వడ్డీ మాపి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ఈ ఆర్ పి దాఖలు చేసిన ఆర్జీదారుడు తమ ఆస్తులకు సంబంధించిన ఆస్తి పన్నులను పూర్తి స్థాయిలో చెల్లించిన పిదప మాత్రమే  వాటిని పరిగణనలోనికి తీసుకొని తగు ప్రక్రియ జరపాలని జోనల్ కమీషనర్లకు కమీషనర్ ఆదేశించారు.

అలాగే 2025-26 సంవత్సరంనకు సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు, నీటి చార్జీలు, సంబంధిత బకాయిలను వెంటనే వసూళ్లు చేసే ప్రక్రియ నిరంతరం జరిగేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమీషనర్లకు కమీషనర్ ఆదేశించారు.

పౌర సంబంధాల అధికారి జివిఎంసి


Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...