Skip to main content

అల్లాహు చూపిన మార్గం..దాతృత్వం, ధార్మిక చింతన * రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

 జీవీఎంసీ పరిధి 34 వ వార్డు అచ్చియమ్మపేట మసీదు రంజాన్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజలకు ఈద్ ముబారక్ (శుభాకాంక్షలు) తెలియజేశారు. అనంతరం ప్రత్యేక ఆహ్వానం మేరకు పాల్గొన్న వాసుపల్లి  మాట్లాడుతూ నెల రోజులు కఠిన దీక్షలు పూర్తి చేసుకుని రంజాన్ పండుగ చేసుకొవడం ముస్లింల సంప్రదాయమన్నారు. శాంతి మార్గమని, పేదవారికి సాయం చేయడం అల్లాహ్ చూపిన మార్గమని, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన శాంతితో ఉండటం పవిత్ర రంజాన్ విశిష్టత పేర్కొన్నారు. అల్లా అనుగ్రహముతో సుఖసంతోషాలతో అల్లాహ్ దీవెనలు మీకు కలకాలం ఉండాలని ఆకాక్షించారు.  అందరికి మంచి జరగాలని మంచి మార్గంలో అందరూ నడవాలన్నారు. స్నేహం, సామరస్యాలను పెంపొందించే వివిధ మతాల పండగలను ఐకమత్యంగా జరుపుకోవడం మతసామరస్యానికి దోహదపడుతుందని కొనియాడారు. శాంతి సామరస్యాన్ని స్నేహభావాన్ని అన్ని పండుగ దినాల్లో చాటి చెప్పడమే మానవ పరమార్ధమన్నారు.హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలన్నారు. ముస్లింలకి సముచిత స్థానం కల్పించి, అభ్యున్నతికి తోడ్పడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అల్లా ఆశీస్సులు, ముస్లింల ప్రేమ మెండుగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...