Skip to main content

పారిశుధ్య కార్మికుడు నాగేశ్వరావును సన్మానించిన కట్టా నారాయణమూర్తి....

అల్లవరం, విశాఖ సందేసం....ఉగాది పర్వదిన సందర్భంగా మొగళ్ళమూరు పారిశుధ్య  కార్మికుడు వేడంగి నాగేశ్వరావును   బిజెపి అల్లవరం మండల అధ్యక్షుడు కట్టా నారాయణమూర్తి ఘనంగా సన్మానించారు.

మొగళ్ళమూరు సిరిగట్లపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోని చెత్తను ఎంతో ఓపికగా ప్రతినిత్యం సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ కార్మికునికి  దుస్సాలువాతో సత్కరించి నూతన వస్త్రాలు అందజేసి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ. నాగు, కట్టా రామసీత, చిట్టూరి కుమారి, ఎ.గౌతమి, అల్లవరపు బాబులు, కాండ్రేగుల వెంకటేశ్వరరావు, ఎ. వంశీ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...