Skip to main content

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ హరీష్ బాలయోగి…

అమలాపురం, విశాఖ సందేసం వైద్య ఖర్చుల నిమిత్తం రీయింబర్స్మెంట్ కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న పలువురికి అమలాపురంలోని కార్యాలయంలో ఎంపీ హరీష్ బాలయోగి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

 మొత్తం 19 మంది లబ్ధిదారులకు 19,62,980/- (పందొమ్మిది లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల యనభై రూపాయలు) లను అందజేశారు. వీరిలో 17 మందికి రీఎంబర్స్మెంట్ చెక్కులు, ఇరువురికి ఎల్ ఓ సి లను అందజేసినట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న వారిని ఈ విధంగా ఆర్థికంగా ఆడుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు ఎంపీ  హరీష్ మాధుర్  ధన్యవాదాలు తెలియజేశారు. 

అలాగే తమరిని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు, సహకరించిన ఎంపీ హరీష్ బాలయోగి కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...