Skip to main content

హరిశ్చంద్రపురం మరియు పాతపట్నం స్టేషన్లలో రైళ్లకు ప్రయోగాత్మక నిలుపుదల ఏర్పాటు

ప్రాంతీయ ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచడం మరియు రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే 58506/58505 విశాఖపట్నం–గుణుపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలుకు హరిశ్చంద్రపురం PH (HCM) స్టేషన్‌లో మరియు 18117 రౌర్‌కెలా–గుణుపూర్–రౌర్‌కెలా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలుకు పాతపట్నం   (PHM) స్టేషన్‌లో ప్రయోగాత్మక నిలుపుదలని ప్రవేశపెట్టింది.


ఈ ప్రయోగాత్మక నిలుపుదలని హరిశ్చంద్రపురం స్టేషన్‌లో ఈ రోజు ఉదయం 08.33 గంటలకు భారత ప్రభుత్వ గౌరవనీయ పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్ మోహన్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్ & పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి శ్రీ కె. అచ్చన్నాయుడు గారు మరియు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా గారు తదితర ప్రముఖులు ప్రారంభించారుఅలాగే,  పాతపట్నం   స్టేషన్‌లో ఈ ప్రయోగాత్మక నిలుపుదలని ఉదయం 11.51 గంటలకు భారత ప్రభుత్వ గౌరవనీయ పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్ మోహన్ నాయుడు గారు,  పాతపట్నం   ఎమ్మెల్యే శ్రీ మామిడి గోవిందరావు గారు మరియు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా గారు తదితర ప్రముఖులు ప్రారంభించారు.

ఈ  నిలుపుదల ఏర్పాటు వల్ల ఈ స్టేషన్లు మరియు పరిసర ప్రాంతాల ప్రయాణికులకు విశాఖపట్నం, భువనేశ్వర్ మరియు మధ్యలోని ఇతర గమ్యస్థానాలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. స్థానిక రైల్వే వినియోగదారులు మరియు ప్రజా ప్రతినిధుల దీర్ఘకాలిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిలుపుదలని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, కనెక్టివిటీని పెంపొందించడం మరియు ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించడం పట్ల ఈస్ట్ కోస్ట్ రైల్వే కట్టుబడి ఉంది. ఈ ప్రయోగాత్మక నిలుపుదల పనితీరు మరియు ప్రయోజనాన్ని ప్రయాణికుల స్పందన మరియు ఆపరేషనల్ సాధ్యత ఆధారంగా కాలానుగుణంగా సమీక్షిస్తారు.


ఇతరంగా, 18525 బ్రహ్మపూర్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలుకు మండాసా రోడ్ (MMS) స్టేషన్‌లో ఉదయం 10.38 గంటలకు ప్రయోగాత్మక నిలుపుదలని భారత ప్రభుత్వ గౌరవనీయ పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్ మోహన్ నాయుడు గారు మరియు పాలాస ఎమ్మెల్యే శ్రీమతి సిరిషా గౌతు సిరీష గారు అందించారు.


ఈ సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాము.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...