Skip to main content

సత్య సాయి సేవా సంస్థలు, విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి యువజన విభాగం (యువత) *దీనుల సేవలో దైవ దర్శనం – ఆంధ్రప్రదేశ్ యువజన పర్తి యాత్రలో భాగంగా విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి యువత సంచార ఆర్త జనోద్ధరణ సేవ*

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత వర్ష జన్మదిన బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఆంధ్రప్రదేశ్ యువజన పర్తి యాత్రలో భాగంగా, విశాఖపట్నం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల యువత విభాగం “మొబైల్ ఆర్థజనోద్ధరణ సేవ” అనే మహత్తర సేవా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించింది.
స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమం అగనంపూడి, కుర్మన్నపాలెం, కేవీకే మందిరం, పెదగంట్యాడ, పంతులగారి మేడ, మింది తో పాటు నగరంలోని మరిన్ని ప్రాంతాలలో ఈ ఆర్త జనోద్ధరణ సేవ  నిర్వహించబడింది.విశాఖపట్నం జిల్లా శ్రీ  సత్యసాయి యువత, మానసికంగా అస్వస్థతతో నిరాధారంగా జీవిస్తూ, అనేక నెలలుగా స్నానం చేయక జుట్టు పెరిగిపోయిన వ్యక్తులను గుర్తించి, వారిని ప్రేమతో చేరదీసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

సమాజంలోని నిరుపేదలు, నిరాధారుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే మహోన్నత సంకల్పంతో విశాఖ యువత ఎంతో ప్రేమతో, అంకితభావంతో ఈ సేవను నిర్వహించారు. ముఖ్యంగా యువత స్వయంగా ముందుకు వచ్చి జుట్టు కత్తిరించడం, గడ్డం తీయడం (టాన్సరింగ్) వంటి సేవలను నేర్చుకొని స్వయంగా నిర్వహించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకువచ్చింది.అనంతరం వారికి వెచ్చని నీటితో స్నానం చేయించి, శుభ్రమైన దుస్తులు అందజేసి, గాయాలు మరియు చర్మవ్యాధులకు ఆయింట్మెంట్లు పూసి, వారి ఆరోగ్యం మరియు గౌరవాన్ని పునరుద్ధరించారు. తదుపరి వారికి ప్రేమతో మహాప్రసాద భోజనం అందజేయడం జరిగింది.ఈ సంచార ఆర్త  జనోద్ధరణ సేవ కేవలం సేవా కార్యక్రమం మాత్రమే కాక, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు బోధించిన “అందరినీ ప్రేమించు – అందరినీ సేవించు” అనే మహావాక్యానికి సజీవ రూపంగా నిలిచింది.

ఈ మహత్తర సేవా కార్యక్రమంలో విశాఖ జిల్లా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, నిజమైన ఆధ్యాత్మికత నిస్వార్థ సేవలోనే ఉందని చాటిచెప్పారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...