అమలాపురం మెడ్ యునైటెడ్ హాస్పిటల్ లో అరుదైన పాంక్రియాటైటిస్ సర్జరీ… కోనసీమ ప్రజలందరూ ఈ సదుపాయాలను వినియోగించుకోవాలి- మెడికల్ డైరెక్టర్ డా.హరి కిరణ్ వర్మ
అమలాపురం, విశాఖ సందేసం...పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన 54 సంవత్సరాల చిట్టిబాబు అనే వ్యక్తి సుమారు సంవత్సరం నుండి “క్రానిక్ ప్యాంక్రియాటైటిస్” వ్యాధి వల్ల వచ్చే నొప్పితో బాధపడుతున్నారు. ఆయన చాలా హాస్పిటల్స్ కి తిరిగినా తన సమస్యకి పరిష్కారం దొరకలేదని, చివరికి హైదరాబాద్ ఏ.ఐ.జీ హాస్పిటల్ కి రిఫర్ చేసారని, హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకునే స్థోమత లేక ఆ రోగి, మెడ్ యునైటెడ్ హాస్పిటల్ అమలాపురంలో ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఉన్నారని ఎవరో చెపితే తెలిసుకొని ఆయనను సంప్రదించారు. డా.సుధీర్ ఆ రోగికి పరీక్షలు జరిపి, ఆయన క్లోమములో రాళ్లు ఏర్పడటం వలన నొప్పితో బాధ పడుతున్నారని గమనించారు. రోగికి తాను శస్త్ర చికిత్స చేసి నయం చేస్తానని ధైర్యం చెప్పారు.
ఈనెల 5వ తేదీన ఆ రోగికి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. సుధీర్, మరియు మత్తు వైద్యులు డా.సురేష్ లతో కూడిన వైద్య బృందం తగిన శస్త్రచికిత్స వియయవంతంగా చేసారు. ఆ రోగి అమలాపురం మెడ్ యునైటెడ్ హాస్పిటల్ లో 6 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పూర్తిగా కోలుకొని 11వ తేదీ న సంతోషంగా ఇంటికి వెళ్లారు. డాక్టర్ సుధీర్ ఎం.ఎస్. జనరల్ సర్జరీ పీ.జీ.ఐ చండీగఢ్‌లో చదివి, ఏ.ఐ.ఎం.స్., న్యూ ఢిల్లీ నుండి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజి ఎం.సి.ఎచ్. చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతున్నారు ఇక మీదట ఎలాంటి కాంప్లికేటెడ్ కేస్ అయినా క్యాన్సర్ అయినా గాని ట్రీట్‌మెంట్ కోసం వైజాగ్ లేదా హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం లేదని, అమలాపురం మెడ్ యునైటెడ్ హాస్పిటల్ లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కోనసీమ ప్రజలందరూ ఈ సదుపాయాలను వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని మెడికల్ డైరెక్టర్ డా.హరి కిరణ్ వర్మ కోరారు.

Comments
Post a Comment