Skip to main content

శిక్షణ పొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసిన సర్పంచ్ తోట శ్రీదేవి.... ఆక్వా కల్చర్ లో మెరుగైన పెంపకంపై ముగిసిన శిక్షణా కార్యక్రమం..

అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం మండలం గోడి గ్రామంలో ఆక్వా కల్చర్ లో మెరుగైన పెంపకము పై శిక్షణా కార్యక్రమం మూడు రోజు బుధవారం ముగిసాయి.  శిక్షణ అవగాహన గురించి ఆక్వా రైతులకు వివరించినట్లు  ఎస్ సి ఓ బాలాజీ వివరించారు.   ఆక్వా శిబిరాన్ని సందర్శించి పాల్గొన్న సర్పంచ్ తోట శ్రీదేవి మాట్లాడుతూ ఆక్వా రైతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి టెక్నికల్ ఆఫీసర్లు వివరించారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను  సర్పంచ్ తోట శ్రీదేవి అందజేశారు. దీనిపై ప్రతి ఆక్వా రైతు ఆక్వా సాగు ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుని ముందుకెళ్లాలో అన్న విషయాలపై సర్పంచ్ వివరించారు.  
శిక్షణ శిబిర కార్యక్రమానికి విచ్చేసిన సర్పంచ్ కు డాక్టర్ ఆనందకుమార్ జే టి ఓ జాయింట్ టెక్నికల్ ఆఫీసర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో  నాయకులు తోట నరసింహారావు,    రేవు శ్రీను, జల్లి ఏడుకొండలు, తాళ్ల సంపత్ రావు, మంగం నాగేశ్వరరావు, రొక్కాల అభిమన్యుడు, రొక్కల సత్యనారాయణ మూర్తి, చెవల వెంకటేశ్వరరావు, సాధనాల చిన సత్యనారాయణ, పోలమురి శ్రీను, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...