Skip to main content

ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?

శ్రీ పరాభవ నామ సంవత్సరం, తెలుగు ఉగాది పండుంగను ప్రతి ఒక్కరూ మార్చి 19 గురువారం రోజున ఘనంగా జరుపుకోనున్నారు. ఉగాది పండుగ అన్ని పండుగలలోకెళ్లా చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అంతే కాకుండా ఈ పవితమైన పండుగ రోజు పంచాంగ శ్రవణం వినడం అనేది తప్పనిసరి. ఈ రోజున చిన్న పెద్దా, అందరూ కూడా ఇంటిలో లేదా ఆలయానికి వెళ్లి పంచాంగ శ్రవణం చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఇంటిని మామిడి ఆకుతోరణాలతో అందంగా అలంకరిస్తారు. కాగా, అసలు ఉగాది పండుగ రోజున మామిడి ఆకు తోరణాలు ఎందుకు కడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

పండితుల ప్రకారం, ఈ రోజు ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకుల తోరణాలు కట్టడం వెనుక, శాస్త్రీయ , ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయంట. ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరూ గుమ్మానికి మామిడి ఆకు తోరణాలు కట్టి, ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసి, ఇంటిని అలంకరించుకుంటారు. పండగ వైభవం మొత్తం గుమ్మంలోనే కనిపిస్తుంది. అంత అద్భుతంగా అలంకరిస్తారు.

అయితే ఇలా మామిడి ఆకు తోరణాలు అనేవి శుభప్రదంగా భావిస్తారు. అందుకే  ఉగాది పండుగ రోజున, ఇంటిలో సానుకూలతన పెంపొందించడానికి మామిడి ఆకు తోరణాలు కడుతారు. అంతేకాకుండా ఇవి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇంటికి శుభాన్నిస్తాయి. ఇవన్నీ కూడా ఇంటిలో సానుకూలత, ఆనందం, శ్రేయస్సు తీసుకొస్తాయని, ఇంటికి ఈ మామిడి ఆకు తోరణాలు కడతారంట.

శాస్త్రీయ పరంగా కూడా ఈ తోరణాలు కట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. తోరణాలు శుభప్రదమైనవి. అంతేకాకుండా, వృక్షశాస్త్రం ప్రకారం, ఇవి చెట్టు నుంచి తీసిన తర్వాత చాలా సేపటి వరకు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అయితే పూర్వం కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు జరిగే సమయంలో ఎక్కువ మంది గుమి గూడే వారు. దాదాపు నలభై నుంచి, యాభైవరకు మంది గుంపులుగా ఒకే చోట చేరేవారంట.

అయితే ఇలా ఇంత మంది గుమిగూడిన సమయంలో ఆక్సిజన్ సరఫరా పెంచడానికి మామిడి ఆకు తోరణాలను కట్టడం అనే శాస్త్రీయమైన పద్ధతి ఆచారంగా ప్రారంభమైనదంట. అంతే కాకుండా ఇది ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది. వాస్తు ప్రకారం కూడా ఇంటిలో ఆనందం, శ్రేయస్సుకు కారణం అవుతుందంట.

అదేవిధంగా, ఉగాది నాడు కొత్త బట్టలు ధరించడం వెనుక ఒక సాంప్రదాయం ఉంది. పూర్వం ఇంటి పురోహితుడు, చాకలి, మంగలి, పనివారితో సహా ఇంటికి సేవలు అందించే వారందరికీ ఉగాది రోజున కొత్త వస్త్రాలు ఇచ్చేవారు. అలాగే, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లలను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, వారికి నూతన వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం ఒక ఆచారంగా ఉండేది. ఈ ఆచారం నుండే మనం కూడా కొత్త వస్త్రాలు ధరించే సాంప్రదాయం వచ్చింది. ఇది ఇతరులకు బహుమతులు ఇవ్వడం ద్వారా ఆనందాన్ని పంచుకునే సంస్కృతికి ప్రతీక.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...