Skip to main content

▪️ నేటి తరం హైటెక్… రాబోయే తరం ఏఐ–క్వాంటం – భవిష్యత్తును ముందే చదివిన దూరదృష్టి నాయకత్వం చంద్రబాబు* *▪️ నాడు ఐటీ విప్లవానికి శ్రీకారం… నేడు క్వాంటం వ్యాలీతో భవిష్యత్తు సాంకేతిక యుగానికి దిశానిర్దేశం* *— తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

అమరావతి మార్చి 07:* నేటి తరం హైటెక్ ప్రపంచంలో ఎదుగుతుండగా, రాబోయే తరం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ ఆధారిత ప్రపంచంలో జీవించబోతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఆ భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి రాష్ట్రాన్ని సిద్ధం చేస్తున్న దూరదృష్టి నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారేనని పేర్కొన్నారు.

ప్రపంచ చరిత్ర పుటలను తిరగేస్తే ఒక నగ్న సత్యం స్పష్టమవుతుందని పల్లా అన్నారు. కాలంతో పాటు అప్‌డేట్ కానివారు చరిత్రలో కలిసిపోతారని, మార్పును ముందుగానే పసిగట్టినవారే ప్రపంచాన్ని శాసిస్తారని పేర్కొన్నారు. మానవ పరిణామ క్రమంలో వ్యవసాయ విప్లవం నుంచి పారిశ్రామిక విప్లవం వరకు, అక్కడి నుంచి సమాచార సాంకేతిక యుగం వరకు ప్రతి కీలక దశలోనూ మార్పును ముందే గుర్తించి అందిపుచ్చుకున్న దేశాలే ప్రపంచ యవనికపై ఆధిపత్యాన్ని సాధించాయని తెలిపారు.

 *క్వాంటం విప్లవం దిశగా ప్రపంచం* 

ఇప్పుడిప్పుడే ప్రపంచం మరో చారిత్రక మలుపు వద్ద నిలిచిందని, ఆ సరికొత్త విప్లవం పేరు క్వాంటం కంప్యూటింగ్ అని పల్లా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, చైనాలోని హైనన్ ప్రావిన్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో, అమరావతిని కేంద్రంగా చేసుకొని క్వాంటం వ్యాలీ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కేవలం ఒక అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమే కాదని, రాబోయే శతాబ్దపు సాంకేతిక పోటీలో భారత్‌ను అగ్రగామిగా నిలిపే సాహసోపేతమైన ముందడుగని అభివర్ణించారు.

 *నాడు హైటెక్ సిటీ… నేడు క్వాంటం వ్యాలీ* 

నాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణంతో ఐటీ విప్లవానికి పునాది వేసిన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని పల్లా గుర్తుచేశారు. నేడు అదే దూరదృష్టితో క్వాంటం వ్యాలీ ద్వారా భవిష్యత్తు ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నారని కొనియాడారు. క్వాంటం వ్యాలీ రాష్ట్ర ఆధునిక సాంకేతిక ప్రగతికి ఒక డిజిటల్ సంతకం అని పేర్కొన్నారు.

 *జాతీయ నాయకత్వం – గ్లోబల్ దిశలో అడుగు* 

అమరావతికి క్వాంటం వ్యాలీ రావడం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసంకల్పం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దశాబ్దాల అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిబద్ధత, మంత్రి నారా లోకేష్ ఆధునిక వ్యూహం కలిసి పనిచేశాయని పల్లా తెలిపారు. 2025 జనవరిలో దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఐబీఎం, గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలతో మంత్రి నారా లోకేష్ జరిపిన ముందస్తు చర్చలే ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాయని చెప్పారు.

అమరావతిని కేవలం ఐటీ హబ్‌గా కాకుండా భవిష్యత్తు సాంకేతిక కేంద్రంగా ప్రపంచానికి పరిచయం చేయడంలో లోకేష్ పాత్ర కీలకమని, చంద్రబాబు తన రాజకీయ చాతుర్యం, అనుభవంతో దీనికి జాతీయ స్థాయి ప్రాధాన్యతను తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎంవో నిరంతర పర్యవేక్షణలో వివిధ శాఖలను సమన్వయం చేస్తూ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం జరిగిందని, ఐబీఎం వంటి సంస్థలతో ఒప్పందాలను ఖరారు చేయడంలో సీఎంవో కీలక పాత్ర పోషించిందన్నారు.

 *అమరావతి చరిత్రలో కొత్త అధ్యాయం* 

దాని ఫలితంగానే ఫిబ్రవరి 7న అమరావతి చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని పల్లా పేర్కొన్నారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కలిసి శంకుస్థాపన చేయడం ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ క్వాంటం పటంలో నిలిపే చరిత్రాత్మక ముందడుగు పడిందన్నారు.

ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి అంతర్జాతీయ దిగ్గజాల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రం భారతదేశంలోనే మొట్టమొదటి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్కు వేదిక కానుందని తెలిపారు. ఆగస్టు నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్‌లో కార్యరూపంలోకి తీసుకురావాలన్న లక్ష్యం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.

 *యువతకు అంతర్జాతీయ అవకాశాలు* 

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాలకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి హైఎండ్ ఉపాధి అవకాశాలను తెరుస్తుందని పల్లా అన్నారు. సంప్రదాయ ఉద్యోగాల పరిధిని దాటి సరికొత్త అవకాశాలు సృష్టించడంతో మేధో వలసలు తగ్గి ప్రతిభ అంతా రాష్ట్రానికే సొంతమయ్యే బ్రెయిన్ గెయిన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 54 వేల మంది విద్యార్థులు క్వాంటం శిక్షణలో పాల్గొనడం ఈ రంగంపై యువత ఆసక్తికి నిదర్శనమన్నారు.

 *ప్రపంచ కంపెనీల విశ్వాసం* 

క్వాంటం కంప్యూటింగ్ దిశగా రాష్ట్రం అడుగులు వేయడం ప్రారంభమైన కొద్దికాలంలోనే గన్నవరంలోని మేధా టవర్స్ అంతర్జాతీయ టెక్ సంస్థలకు కేంద్రంగా మారిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతపై ఉన్న విశ్వాసంతో క్యూక్లారివోయెన్స్, క్యూబీట్స్, సైబ్రానెక్స్, క్వాంటం ఏఐ గ్లోబల్, క్యూబిటెక్, క్వాన్ ఫ్యూయెన్స్ వంటి దాదాపు 30 అగ్రశ్రేణి సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని చెప్పారు. చంద్రబాబు ఒక కొత్త సాంకేతిక దిశలో అడుగు వేస్తే ప్రపంచం మొత్తం అటువైపే నడుస్తుందనే నమ్మకానికి ఈ సంస్థల రాకే నిదర్శనమన్నారు.

 *క్వాంటం కంప్యూటింగ్ విప్లవం* 

క్వాంటం కంప్యూటింగ్ గణన ప్రక్రియలోనే ఒక అసాధారణ విప్లవమని పల్లా వివరించారు. సాధారణ కంప్యూటర్లు బిట్స్ ఆధారంగా పనిచేస్తే, క్వాంటం కంప్యూటర్లు క్విబిట్స్ ద్వారా ఒకే సమయంలో 0 మరియు 1 రెండింటినీ ఉపయోగించి అద్భుత వేగాన్ని ప్రదర్శిస్తాయని తెలిపారు. సాధారణ కంప్యూటర్లకు శతాబ్దాల సమయం పట్టే సంక్లిష్ట సమస్యలను క్వాంటం కంప్యూటర్లు కేవలం నిమిషాల్లోనే పరిష్కరించగలవని చెప్పారు. కొత్త మందుల తయారీ నుంచి ఇంటర్నెట్ భద్రత వరకు అనేక రంగాల్లో ఈ సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని పేర్కొన్నారు.

 *ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ గుర్తింపు* 

అందుకే అమరావతిలో నిర్మించే క్వాంటం వ్యాలీ రాష్ట్రాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చనుందని పల్లా అన్నారు. నాడు ఐటీతో రాష్ట్ర తలరాత మారినట్లే, రేపు ఈ క్వాంటం వ్యాలీ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలబెట్టబోతోందన్నారు.

 *రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ* 

ఇది కేవలం టెక్నాలజీ మార్పు మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని తెలిపారు. అధిక విలువ కలిగిన పరిశ్రమలు, పరిశోధన ఆధారిత పెట్టుబడులు రావడం వల్ల ఆదాయ వనరులు పెరిగి విజ్ఞానమే సంపదగా మారే ఆర్థిక వ్యవస్థకు పునాది పడుతుందని అన్నారు.

 *ఐటీ నుంచి క్వాంటం వరకు – అదే దూరదృష్టి* 

1998లో హైదరాబాద్ హైటెక్ సిటీకి శ్రీకారం చుట్టినప్పుడు వ్యక్తమైన సందేహాలను పటాపంచలు చేస్తూ ఆ నిర్ణయం ఒక తరాన్ని ఐటీ యుగంలోకి నడిపించిందని పల్లా గుర్తుచేశారు. సరిగ్గా అదే దూరదృష్టి నేడు అమరావతి క్వాంటం వ్యాలీ రూపంలో కనిపిస్తోందన్నారు. అప్పట్లో ఐటీ విప్లవానికి తలుపులు తెరిచిన నాయకుడు చంద్రబాబు… ఇప్పుడు అంతకంటే వేగవంతమైన ఏఐ–క్వాంటం యుగానికి రాష్ట్రాన్ని సిద్ధం చేస్తున్న నాయకుడు కూడా ఆయనేనని కొనియాడారు.

 *భవిష్యత్తుకు రాష్ట్రం సిద్ధం* 

సాంకేతిక మార్పును గుర్తించి అప్‌డేట్ కాకపోతే సమాజం వెనుకబడిపోతుందని చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరించిందని పల్లా అన్నారు. కాలం ఎవరి కోసం ఆగదని, కాలంతో పాటు పరిగెత్తాలా లేక కాలం మనల్ని పక్కన పెట్టాలా అనే ప్రశ్నకు రాష్ట్రం సగర్వంగా ఇస్తున్న సమాధానమే అమరావతి క్వాంటం వ్యాలీ అని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...