విశాఖపట్నం: మానవ సేవ చేయటంలో మహిళలదే కీలక పాత్ర అని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శనివారం విమ్స్ ఆసుపత్రి నందు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉంది అంటే దానికి మహిళలు చేసే సేవే అన్నారు. అలాగే వైద్య రంగంలో అత్యధికంగా మహిళలే తమ సేవలను రోగులకు అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా మహిళలు అన్ని రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును పొందుతున్నారన్నారు. మహిళలు ఇంటికి, సమాజానికి, దేశానికి వెన్నుముక అని కొనియాడారు. వారు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది సమాజం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు... ఆరోగ్యం అంటేనే మహిళలు.. మహిళలు అంటేనే ఆరోగ్యమని కొనియాడారు.. ఈ సందర్భంగా విమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...

Comments
Post a Comment