అల్లవరం, విశాఖ సందేసం....ఉగాది పర్వదిన సందర్భంగా మొగళ్ళమూరు పారిశుధ్య కార్మికుడు వేడంగి నాగేశ్వరావును బిజెపి అల్లవరం మండల అధ్యక్షుడు కట్టా నారాయణమూర్తి ఘనంగా సన్మానించారు.
మొగళ్ళమూరు సిరిగట్లపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోని చెత్తను ఎంతో ఓపికగా ప్రతినిత్యం సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ కార్మికునికి దుస్సాలువాతో సత్కరించి నూతన వస్త్రాలు అందజేసి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ. నాగు, కట్టా రామసీత, చిట్టూరి కుమారి, ఎ.గౌతమి, అల్లవరపు బాబులు, కాండ్రేగుల వెంకటేశ్వరరావు, ఎ. వంశీ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment