విశాఖపట్నం : ఔత్సాహికులకు స్ఫూర్తిని కలిగించే వెటరన్ క్రీడాకారులను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. వృద్ధాప్యంలో కూడా యువ క్రీడాకారులకు ధీటుగా అనేక విభాగాల్లో పతకాలు సాధించడం గొప్ప
విషయమన్నారు.మధ్య ప్రదేశ్‌లోని జబల్పూర్, థాయ్ లాండ్‌లో నిర్వహించిన నేషనల్, ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో పతకాలు సాధించిన వెటరన్ క్రీడాకారుల అభినందన కార్యక్రమం విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్లో శనివారం నిర్వహించారు. వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ హాజరై పతకాలు సాధించిన వెటరన్ క్రీడాకారులను,పలువురు జర్నలిస్టులను సత్కరించారు.ఈ సందర్భంగా పదవతరగతి విద్యార్థులకు పరీక్ష కిట్ లు అందచేసి ఆశీర్వదించారు.అనంతరం కమిషనర్ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. వృద్ధాప్యం అన్నది శరీరానికే తప్ప, మనసుకి కాదన్నారు. నేడు రాష్ట్రాన్ని
విశిష్ట అతిథి , టస్టు ఛైర్మన్ డాక్టర్ కమల్ బైద్ మాట్లాడుతూ వెటరన్ క్రీడాకారులకు సంపూర్ణ తోడ్పాటును అందిస్తున్నామన్నారు. అలాగే ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. జాతీయ,అంతర్జాతీయ పోటీల్లో వెటరన్ క్రీడాకారులు పతకాల పంట పండించడం అభినందనీయమన్నారు.వారిని స్ఫూర్తిగా తీసుకుని యువతరం కూడా క్రీడల్లో రాణించాలని అన్నారు. తమ ట్రస్టు ద్వారా మరిన్ని కార్యక్రమాలను చేపట్టడానికి కృషి చేస్తామన్నారు. ట్రస్టీ నండూరి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇండియా మాస్టర్స్ సెక్రటరీ జనరల్ డాక్టర్ మంగ వరప్రసాద్, ట్రస్టీ సిహెచ్ శ్రీనివాసరాజు , వెటరన్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాత్రికేయులకు సత్కారం* కాలంతో పరుగులు తీస్తూ, తమ వార్తలతో సమాజాన్ని జాగృతం చేసే పాత్రికేయుల సేవలు నిరుపమానమని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా పలువురు జర్నలిస్టులను వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్టు ఛైర్మన్ కమల్ బైద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి , ట్రస్టీ నండూరి రామకృష్ణ తదితరులు సత్కరించారు. కేవీ శర్మ(విశాఖ సందేశం), విఎస్ జగన్‌మోహన్(విశ్వ చిత్రకళ), కొణతాల శ్రీనివాస్(విశాఖ వాయిస్), ఎన్ అరుణ్ భాస్కర్(హరి) (ది ఇన్వెస్టిగేషన్) , ధవళేశ్వరపు రవికుమార్(లక్ష్యం), మేడిశెట్టి హరనాథ్(అక్షర పోరాటం), ఆర్ వెంకటరావు(మనపౌర సమాచారం) ,జీ ప్రసాద్(జర్నలిస్ట్ పవర్),పీ రవిశంకర్(నవతరం) తదితరులు సత్కారం అందుకున్నారు
విషయమన్నారు.మధ్య ప్రదేశ్‌లోని జబల్పూర్, థాయ్ లాండ్‌లో నిర్వహించిన నేషనల్, ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో పతకాలు సాధించిన వెటరన్ క్రీడాకారుల అభినందన కార్యక్రమం విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్లో శనివారం నిర్వహించారు. వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ హాజరై పతకాలు సాధించిన వెటరన్ క్రీడాకారులను,పలువురు జర్నలిస్టులను సత్కరించారు.ఈ సందర్భంగా పదవతరగతి విద్యార్థులకు పరీక్ష కిట్ లు అందచేసి ఆశీర్వదించారు.అనంతరం కమిషనర్ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. వృద్ధాప్యం అన్నది శరీరానికే తప్ప, మనసుకి కాదన్నారు. నేడు రాష్ట్రాన్నివిశిష్ట అతిథి , టస్టు ఛైర్మన్ డాక్టర్ కమల్ బైద్ మాట్లాడుతూ వెటరన్ క్రీడాకారులకు సంపూర్ణ తోడ్పాటును అందిస్తున్నామన్నారు. అలాగే ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. జాతీయ,అంతర్జాతీయ పోటీల్లో వెటరన్ క్రీడాకారులు పతకాల పంట పండించడం అభినందనీయమన్నారు.వారిని స్ఫూర్తిగా తీసుకుని యువతరం కూడా క్రీడల్లో రాణించాలని అన్నారు. తమ ట్రస్టు ద్వారా మరిన్ని కార్యక్రమాలను చేపట్టడానికి కృషి చేస్తామన్నారు. ట్రస్టీ నండూరి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇండియా మాస్టర్స్ సెక్రటరీ జనరల్ డాక్టర్ మంగ వరప్రసాద్, ట్రస్టీ సిహెచ్ శ్రీనివాసరాజు , వెటరన్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాత్రికేయులకు సత్కారం* కాలంతో పరుగులు తీస్తూ, తమ వార్తలతో సమాజాన్ని జాగృతం చేసే పాత్రికేయుల సేవలు నిరుపమానమని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా పలువురు జర్నలిస్టులను వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్టు ఛైర్మన్ కమల్ బైద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి , ట్రస్టీ నండూరి రామకృష్ణ తదితరులు సత్కరించారు. కేవీ శర్మ(విశాఖ సందేశం), విఎస్ జగన్‌మోహన్(విశ్వ చిత్రకళ), కొణతాల శ్రీనివాస్(విశాఖ వాయిస్), ఎన్ అరుణ్ భాస్కర్(హరి) (ది ఇన్వెస్టిగేషన్) , ధవళేశ్వరపు రవికుమార్(లక్ష్యం), మేడిశెట్టి హరనాథ్(అక్షర పోరాటం), ఆర్ వెంకటరావు(మనపౌర సమాచారం) ,జీ ప్రసాద్(జర్నలిస్ట్ పవర్),పీ రవిశంకర్(నవతరం) తదితరులు సత్కారం అందుకున్నారు

Comments
Post a Comment