Skip to main content

నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం* *ఏర్పాట్లును పర్యవేక్షించిన మంత్రి అనిత* *పండగ వాతావరణంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది* *కేవలం భూమి పూజ మాత్రమే కాదు,రాష్ట్ర అభివృద్ధికి నాంది* *రైతుల త్యాగాలు మరువలేము* *రైతులు త్యాగాలను ఏపీలో ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి*..*హోం మంత్రి అనిత*

 

నక్కపల్లి, మార్చి 22:- పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో రేపు నిర్వహించనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత శంకుస్థాపన జరగనున్న ప్రదేశాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన వేదిక, హెలిపాడ్, గ్యాలరీల వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కూటమి నాయకులకు ఆమె పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ, రేపు జరిగే కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతుందని తెలిపారు. ఇది కేవలం భూమి పూజ మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి నాంది అని పేర్కొన్నారు. 

పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారిందని, స్టీల్ ప్లాంట్ కోసం రైతులు చేసిన త్యాగాలు మరువలేము అన్నారు. తమ భూములు, గ్రామాలు ఇచ్చిన రైతులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని, దీని ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో అనకాపల్లి జిల్లా రూపురేఖలు మారనున్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...