అమలాపురం, విశాఖ సందేసం రాష్ట్ర శాసనమండలి సభ్యులు కుడుపూడి సూర్యనారాయణరావు పుట్టినరోజు పురస్కరించుకుని వైసీపీ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు అయన అమలాపురం కార్యాలయం, స్వగృహాలనందు కేక్ లు కట్ చేసి పుష్పగుచ్చాలను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎంపీ చింతా అనురాధ, నియోజకవర్గ ఇంచార్జ్ పీనిపే శ్రీకాంత్, మట్టపర్తి నాగేంద్ర, జున్నురి బాబి, ఇళ్ల శేషారావు ,కొల్లటి దుర్గాబాయి,కట్టోజు రాము, పిల్లి సుబ్రహ్మణ్యం, సత్యం కాపు, అంబికా శ్రీను, గుత్తుల ధర్మ, గుత్తుల ఏసుబాబు, చప్పిడి శోభన్ బాబు, కుడుపూడి త్రినాధ్, కుడుపూడి శ్రీనివాస్ , దొంగ సింహాచలం, ముంగర ప్రసాద్, పితాని చిన్నా, రెడ్డి వెంకటేశ్వరరావులు పుష్పగుచ్చలు అందజేసి దుస్సాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...


Comments
Post a Comment