ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఆధ్యాత్మికతతో కూడిన సేవా మార్గాన్ని మరింత బలపరచే దిశగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల “శ్రీ సత్య సాయి యువత పర్తి యాత్ర ” ఈరోజు సాయంత్రం సాయి కుల్వంత్ హాల్ సభా మంటపంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆనందం తవ దర్శనం – ఆంధ్రప్రదేశ్ యువకుల భక్తి గాన కార్యక్రమం | మార్చి 18, 2026
పవిత్ర ఉగాది పర్వదినం సందర్బంగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాల వద్ద తమ సమిష్టి కృతజ్ఞతాభివందనాలు మరియు ప్రేమను అర్పిస్తూ హృదయానికి హత్తుకునే భక్తి గాన కార్యక్రమాన్ని సమర్పించారు. మొత్తం తొమ్మిది హృద్యమైన భక్తి గీతాలతో ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతతో నిండిన ఆనందాన్ని పంచింది.
కార్యక్రమం ప్రారంభానికి గంట ముందుగా ప్రకృతి సైతం ఈ దివ్య వేదికను సిద్ధం చేసినట్లుగా మెరుపులు, ఉరుములు, తేలికపాటి వర్షంతో పరిసరాలను చల్లబరచి, ఒక ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణాన్ని సృష్టించింది. ఈ సహజ సౌందర్యానికి తోడుగా యువకుల మధుర గానం మరింత ఆహ్లాదకరమైన అనుభూతిని అందించింది. ప్రతి గీతం భక్తి, సమర్పణ భావాలతో నిండి, ఆ సాయంత్రాన్ని దివ్యానుభూతిగా మార్చి, శ్రోతలందరినీ ఆనందభరితంగా ముంచెత్తింది.
ఈ కార్యక్రమానికి ముందు సాయంత్రం, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ లక్ష్మణరావు గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి సంవత్సరం భగవాన్ వారి దివ్య పాదపద్మాల వద్ద సేవ, ప్రేమను అర్పించే ఈ పవిత్ర అవకాశాన్ని పొందడం గొప్ప భాగ్యమని కృతజ్ఞతతో తెలిపారు. ఈ వార్షిక యాత్ర యువతకు అందించే ఆనందం, ఆధ్యాత్మిక తృప్తిని ఆయన విశదీకరించారు.అనంతరం రాష్ట్ర యువజన సమన్వయకర్త శ్రీ గౌతమ్ సి గారు సంవత్సరమంతా నిర్వహించిన వివిధ కార్యక్రమాలపై సమగ్ర నివేదికను సమర్పిస్తూ, సేవ, భక్తి, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలను వివరించారు.
పవిత్ర ఉగాది పర్వదినం సందర్బంగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాల వద్ద తమ సమిష్టి కృతజ్ఞతాభివందనాలు మరియు ప్రేమను అర్పిస్తూ హృదయానికి హత్తుకునే భక్తి గాన కార్యక్రమాన్ని సమర్పించారు. మొత్తం తొమ్మిది హృద్యమైన భక్తి గీతాలతో ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతతో నిండిన ఆనందాన్ని పంచింది.
కార్యక్రమం ప్రారంభానికి గంట ముందుగా ప్రకృతి సైతం ఈ దివ్య వేదికను సిద్ధం చేసినట్లుగా మెరుపులు, ఉరుములు, తేలికపాటి వర్షంతో పరిసరాలను చల్లబరచి, ఒక ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణాన్ని సృష్టించింది. ఈ సహజ సౌందర్యానికి తోడుగా యువకుల మధుర గానం మరింత ఆహ్లాదకరమైన అనుభూతిని అందించింది. ప్రతి గీతం భక్తి, సమర్పణ భావాలతో నిండి, ఆ సాయంత్రాన్ని దివ్యానుభూతిగా మార్చి, శ్రోతలందరినీ ఆనందభరితంగా ముంచెత్తింది.
ఈ కార్యక్రమానికి ముందు సాయంత్రం, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ లక్ష్మణరావు గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి సంవత్సరం భగవాన్ వారి దివ్య పాదపద్మాల వద్ద సేవ, ప్రేమను అర్పించే ఈ పవిత్ర అవకాశాన్ని పొందడం గొప్ప భాగ్యమని కృతజ్ఞతతో తెలిపారు. ఈ వార్షిక యాత్ర యువతకు అందించే ఆనందం, ఆధ్యాత్మిక తృప్తిని ఆయన విశదీకరించారు.అనంతరం రాష్ట్ర యువజన సమన్వయకర్త శ్రీ గౌతమ్ సి గారు సంవత్సరమంతా నిర్వహించిన వివిధ కార్యక్రమాలపై సమగ్ర నివేదికను సమర్పిస్తూ, సేవ, భక్తి, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమం పవిత్రమైన వేదపఠనంతో ప్రారంభమై, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది.
అనంతరం భక్తి పరవశతను నింపిన ఆధ్యాత్మిక సంగీతాన్ని శ్రీ సత్యసాయి ఆంధ్రప్రదేశ్ యువత(పురుషులు) సమర్పించి, సభలో ఉన్న అందరినీ భక్తి భావంలో ముంచెత్తారు . కార్యక్రమం చివరగా భజనల మంగళార్థంతో ఘనంగా ముగిసింది.
ఈ శ్రీ సత్య సాయి యువత పర్తి యాత్ర మార్చి 19 మరియు 20 తేదీలలో కూడా కొనసాగనుంది.

Comments
Post a Comment