పాఠశాల అభివృద్ధికి మీ కృషి మరువలేనిది : సర్పంచ్ చిట్నీడి శ్రీదేవి.... బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం...
అల్లవరం, విశాఖ సందేసం....అల్లవరం మండలం గోడితిప్ప గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఎంసి సభ్యులు, విద్యార్థులు అందరూ కలిసి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బదిలీపై వేరే పాఠశాలకు వెళ్లిన టీచర్లకు ఆదివారం ఘనంగా ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సూర్యచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్యతిధులుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్నీడి శ్రీదేవి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీదేవి మాట్లాడుతూ ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన ముత్యాల నరసింహారావు, మోసుగంటి లక్ష్మీప్రసన్న , సాల్మన్ రాజు ఈ పాఠశాలకు అభివృద్ధికి కృషి చేశారని, విద్యార్థులకు చక్కగా బోధించారని మరల అవకాశం ఉంటే మళ్ళీ ఈ పాఠశాలకు వచ్చి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ కొల్లు వేణుగోపాల్ మాట్లాడుతూ గతంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన ముత్యాల నరసింహారావు గురించి, అతను చేసిన అభివృద్ధి పనుల గురించి కొనియాడారు. అలాగే పాఠశాలలో పనిచేసిన మోసుగంటి శ్రీ లక్ష్మీప్రసన్న గురించి ఆమె విద్యార్థులకు విద్య నేర్పిన విధానం గురించి కొనియాడారు. ఈ పాఠశాలలో పనిచేసిన ఎం టి ఎస్ టీచర్ టి సాల్మన్ రాజు గురించి అతని చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఈ పాఠశాలలో పనిచేసినప్పుడు ఎస్ఎంసి చైర్మన్, విద్యార్థులు తల్లిదండ్రులు చక్కగా సహకరించారని, మరల అవకాశం ఉంటే ఈ స్కూల్ కోరుకుని మరల సేవలందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎస్. సత్యనారాయణ, బసవా శేషాంబ, చిట్టినీడి శ్రీనివాసరావు ,విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments
Post a Comment