Skip to main content

అమలాపురంలో ‘జాదూగర్ సికిందర్’ ఇంద్రజాల విన్యాసాల హోరు.. నేటి నుండే మ్యాజిక్ షోలు.. అబ్బురపరిచే ‘డైనోసార్ భ్రమ’, ‘బెర్ముడా ట్రయాంగిల్’ విన్యాసాలు

అమలాపురం, విశాఖ సందేసం... డా. బిఆర్  అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు అద్భుతమైన వినోదాన్ని అందించేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెజీషియన్ సూపర్ స్టార్ జాదూగర్ సికిందర్ అమలాపురం చేరుకున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వేదికగా నేటి నుండి ఈ మ్యాజిక్ షోలు ప్రారంభం కానున్నాయి.రాబోయే 20 రోజుల పాటు ప్రతిరోజూ రెండు ప్రదర్శనలు ఉంటాయి.​మొదటి షో: సాయంత్రం 5:00 గంటల నుండి 7:00 వరకు


రెండవ షో: రాత్రి 7:00 గంటల నుండి 9:00 వరకు. షోలు ఏర్పాటు చేశామని తెలిపారు.గతంలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాల్లో 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సికిందర్ బృందం, ఇప్పుడు అమలాపురం ప్రేక్షకులను అలరించనుంది.ఈ షోలో ప్రత్యేకంగా ‘డైనోసార్ భ్రమ’ , రహస్యాలతో కూడిన ‘బెర్ముడా ట్రయాంగిల్’ ప్రభావం మరియు గగుర్పాటు కలిగించే వినూత్న ఇంద్రజాల విన్యాసాలు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు కడుపుబ్బ నవ్వించే ‘కామెడీ మ్యాజిక్’ కూడా ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇవ్వనుంది.​ఈ ప్రదర్శనలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆర్గనైజర్ ఏ.కే. బాబు మాట్లాడుతూ.. కొత్త శైలి,సరికొత్త అనుభవంతో ప్రతిరోజూ రెండు షోలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

కోనసీమ జిల్లా ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనను తిలకించాలని ఆయన కోరారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో అమలాపురంలో మ్యాజిక్ సందడి మొదలైంది.

ప్రదర్శన సమయాలు మరియు టిక్కెట్ల వివరాల కోసం నేరుగా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద సంప్రదించవచ్చని తెలిపారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...