పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబరచండి. *క్లాప్ వాహనాలపై విజిల్స్ సౌండ్ తప్పనిసరిగా అమర్చాలి. -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ .
విశాఖపట్నం మార్చ్ 2: పారిశుద్ధ్య పనుల నిర్వహణలో అశ్రద్ధ వహించకుండా రోడ్లు, కాలువలు, ఫుట్పాత్ లు నిత్యం పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, ప్రతి ఇంటి నుండి వ్యర్ధాల సేకరణకు వచ్చే క్లాప్ వాహనాల రాకపోకలను గమనించేందుకు ప్రజల అవగాహన కొరకు క్లాప్ వాహనాలకు విజిల్స్ సౌండ్ సిస్టమ్ తప్పనిసరిగా అమర్చి అమలు చేయాలని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నార్త్ జోన్ 42వ వార్డు పరిధిలోని రైల్వే న్యూ కాలనీ, తాటిచెట్లపాలెం తదితర ప్రాంతాలలో పర్యటించారు.ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి ఆలసత్వం వహించకుండా ఎప్పటి చెత్తను అప్పుడే తొలగించే చర్యలు చేపట్టాలని ప్రజా ఆరోగ్య అధికార్లను ఆదేశించారు. తాటిచెట్లపాలెం, న్యూ కాలనీ తదితర ప్రాంతాల్లో ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తుండడం గమనించి, ఫుట్ పాత్ పై ఆక్రమణలు తొలగిస్తున్నప్పటికీ మరల యధా స్థితిలో ఆక్రమణలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని సౌత్, నార్త్ జోనల్ కమిషనర్లను కమీషనర్ వాకిటాకీ ద్వారా ఆదేశించారు. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరిస్తున్న క్లాప్ వాహనాలపై విజిల్ సౌండ్ లేనందున ప్రజలకు చెత్త తీసుకెళ్లే వాహనం వచ్చిందని ఎలా తెలుస్తుందని , ప్రజలు క్లాప్ వాహనాలను గమనించేందుకు తప్పనిసరిగా ప్రతి క్లాప్ వాహనానికి విజిల్స్ సౌండ్స్ సిస్టమ్ అమర్చి వినియోగించేలా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్ ను వాకిటాకీ ద్వారా ఆదేశిస్తూ పారిశుద్ధ్య నిర్వహణపై పలు సూచనలు చేశారు.
ఈ పర్యటనలో వార్డు శానిటేషన్ కార్యదర్శులు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు .
పౌర సంబంధాల అధికారి,జివిఎంసి
.jpeg)
.jpeg)
Comments
Post a Comment