యం.వి.పి మరియు ద్వారకానగర్ శాఖల వార్షి కోత్సవం ఋషికొండలో గాయిత్రీ విద్యాపరిషత్ డిగ్రీ మరియు పి.జి.కళాశాల (అటానమస్) జీవిపి కళాశాల ఆరుబయలు రంగస్థలం ప్రాంగణంలో ఘనంగా నిర్వహింపబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీరామదాస'గా ప్రసిద్ధి వహించిన డాక్టర్ జి.ఆర్. కె. ప్రసాద్ (రాంబాబు) గౌరవ కార్యదర్శి, విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడెమీ కళాభారతి విచ్చేసి ప్రసంగించారు .వీరు తమ ప్రసంగంలో ఆత్మ విశ్వాసంతో నైతిక విలువలతో మర్యాదా పురుషోత్తములయిన ఆదర్శనాయకులను లక్ష్యంగా వ్యక్తిత్వాన్ని నిర్మించుకొని ఉత్తమ సమాజ నిర్మాతలు కావాలని సందేశం అందించారు. అజిని మోటో బయోఫార్మా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మేనిజాంగ్ డైరక్టరు శ్రీ కె.వి.రాజు గారు గౌరవ అతిథిగా విచ్చేశారు. నేడు విద్యార్థులకు వారి రంగంలోనే కాక ఇతర రంగాలలో నైపుణ్యాలు అంది పుచ్చుకొని మారుతున్నకాలంలో ఉద్యోగ అర్హతకు సంబంధించిన నెపుణ్యాలను అందిపూచ్చుకోవాలని అన్నారు. భావిజీవితానికి బాట కళాశాలలోనే నిర్ణయం అవుతుందని విద్యార్థులను అభినందించారు.

ఆచార్య కె.యస్.బోస్, కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు నిర్వహణ అనుకూలంగా అన్నిరంగాలలో ప్రావీణ్యం సాధించాలని అన్నారు. ఆచార్యపి. సోమరాజు మాష్టారు జీవిపి విద్యార్థులు ప్రపంచ విజ్ఞాన రంగంలో బాండ్ అంబాసిడర్లు కావాలి అన్నారు.
శ్రీయుతులు డి.గిరిధర్, డైరక్టరు, యు. జి. కోర్సులు కళాశాలనివేదికను సమర్పిస్తూ విద్యార్థులు అధ్యాపకులు సాధించిన విజయాలు, యన్.సి.సి యనియస్, సాంస్కృతిక విభాగాలలో, జాతీయసదస్సులలో విద్యార్థుల క్రియా పాత్రను హర్షధ్వానాల మధ్య తెలియచేశారు. అదిరేటి దుస్తులతో హుషారయిన పాటలతో




Comments
Post a Comment