విశాఖ రూరల్ పరిధి
చినగదిలీ సర్వే నంబరు 134 లో ఈ స్థలం ఉందని గుర్తు చేశారు. 1960వ సంవత్సరంలో ఊరుమిటి అప్పల స్వామి చే ఈ స్థలం కొనుగోలు చేయబడిందన్నారు. కాగా,
1970లో సుబ్బరాజు చే ఇక్కడ లేఅవుట్ రూపొందించబడిందన్నారు. ఇక్కడ మొత్తం 28 ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. అప్పల స్వామి ఈ స్థలాలు కొనుగోలు చేసిన వారి పేరిట రిఃస్ట్రేషన్ లు చేశారాని స్పష్టం చేశారు.
ఉరిమిటి అప్పలస్వామిచే 6.70 ఎకరాలు కొనుగోలు చేయబడిందన్నారు. ఈ స్థలం ఆక్రమణ కు
గోర్లే లక్ష్మి దౌర్జన్యం చేస్తున్నారని గుర్తు చేశారు.
యలమంచిలి గ్రామానికి చెందిన....గొర్లె లక్ష్మి తప్పుడు సర్వే నంబరు 143/1 తో డాక్యుమెంట్ లో తప్పుగా నమోదు చేయబడింది అని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సర్వే నంబర్ బీచ్ రోడ్డు లో వుంది అని అయన పేర్కొన్నారు. ఆమె తప్పుడు డాక్యుమెంట్లు చూపించి ఇక్కడి స్థలంలో నిర్మాణాలు చేపట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 8 న ఆరిలోవ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు విశాఖ రూరల్ తహసీల్దార్ కి రిపోర్ట్ రాశారు అన్నారు. తహసీల్దార్ రిపోర్ట్ ఇంకా పెండింగ్ లో ఉండగానే ఆమె నిర్మాణం చేపట్టడం అన్యాయం అన్నారు.
ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Comments
Post a Comment