Skip to main content

అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: మాజీ ఎంపీ చింతా అనురాధ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే బాబు నెరవేర్చాలి* ఈ ఉద్యమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది...

అల్లవరం, విశాఖ సందేసం తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ “చలో విజయవాడ” పిలుపుతో ధర్నా చౌక్‌లో నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తక్షణమే స్పందించాలని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు  చింతా అనురాధ  డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ సిబ్బందికి గౌరవ వేతనాన్ని గణనీయంగా పెంచుతామని, పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని ఆమె తీవ్రంగా విమర్శించారు. దాదాపు 20 నెలలుగా హామీల అమలుకై వారు ఎదురు చూస్తున్నారని పేర్కొంటూ, అంగన్వాడీల ఉద్యమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి సంఘీభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

మండుటెండల్లో ధర్నా చౌక్‌లోనే వంటావార్పు చేపట్టి, రోడ్లపైనే భోజనాలు చేస్తూ, అక్కడే నిద్రించి నిరసనలు తెలుపుతున్నా కూడా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని ఆమె అన్నారు. పైగా, వారిని దుర్మార్గంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని అనురాధ  ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది చిన్నారులకు, గర్భిణీలు మరియు బాలింతలకు పోషకాహారం, ఆరోగ్యం మరియు ప్రాథమిక విద్యను అందించే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీలకు గౌరవ వేతనాన్ని పెంచాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని, యాప్‌ల ద్వారా పెరిగిన ఆన్లైన్ పని భారాన్ని తగ్గించాలని, రిజిస్టర్ల నిర్వహణను సరళతరం చేయాలని, పదవీ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాలను పెంచి వారందరికీ సామాజిక భద్రత కల్పించాలని చింతా అనురాధ  డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...