Skip to main content

జీవీఎంసీలో ఘనంగా అమరజీవి జయంతి వేడుకలు. *పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేద్దాం. - నగర మేయర్ పీలా శ్రీనివాసరావు

విశాఖపట్నం మార్చి 16:  అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు మరువలేనవని చరిత్రలో ఎన్నటికీ నిలిచి ఉంటాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి రమణమూర్తి, పి.నల్లనయ్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహా నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాలను ఎంచుకొని హరిజనోద్ధరణ ఆశయ సాధన కొరకు జీవితాంతం కృషి చేశారని, భాషాపరంగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం అవసరమని అందుకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను ఆంధ్ర రాష్ట్ర కోసం అర్పించారని తెలిపారు. ఆయన చేసిన కృషికి చిహ్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో 6.8 ఎకరాలలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని నేడు ప్రారంభించారని తెలిపారు. ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరించడం తెలుగువారి ఆత్మగౌరవానికి, నిరంతర స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. 


ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జాయింట్ డైరెక్టర్ (అమృత్)  డి.విజయ భారతి, సిసిపి ఏ ప్రభాకర్ రావు, డిసిఆర్ శ్రీనివాసరావు, జీవీఎంసీ ప్రధాన పైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, కార్యదర్శి బివి రమణ, ఎగ్జామ్ ఆఫ్ అకౌంట్స్ సి వాసుదేవ రెడ్డి, హార్టికల్చర్ అధికారి వాసుకి, ఇంచార్జ్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఇ.ఎ.రాజు, సిటీ వెటర్నరీ ఆఫీసర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...