విశాఖ సందేసం....అమలాపురం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామ సచివాలయంలో సర్పంచ్ కరాటం ప్రసన్న ప్రవీణ్, వార్డు సభ్యులకు,మాజీ సర్పంచ్ లకు,మాజీ ఎం.పి.టి.సిలకు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సంధర్బంగా పలువురు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల కాలంలో గ్రామాభివృద్ధి కోసం పాటుపడ్డారని అన్నారు. జిల్లా, రాష్ట్ర,జాతీయ స్థాయిలో రెడ్డిపల్లి గ్రామానికి అవార్డులు రావడం గర్వకారణంగా ఉందని రెడ్డిపల్లి గ్రామం అవార్డులలో ముందు నిలిచిందని అన్నారు. ఈ కార్యాలయంలో ఎ.డి.కెనడి,ఎ.ఓలు మనోహర్, కె. ప్రవీణ్,మాజీ సర్పంచ్ కరాటం సూర్య భాస్కరరావు,సొసైటీ డైరెక్టర్ కొలిశెట్టి జయప్రకాష్,ఎం.పి.టి.సి.సత్తి ఆది లక్ష్మి, సూరిబాబు, కార్యదర్శి గణపతి, వార్డు సభ్యులు ఆనెం సురిబాబు(చంద్రరావు) ,ఉప సర్పంచ్ రేలంగి శ్రీను,రేలంగి దుర్గా ప్రసాద్,రేలంగి సత్య దుర్గ, మాజి సర్పంచ్ తవిటిక పుణ్యవతి శ్రీను ఎం.పి.టి.సి.రాంబాబు నల్లా సతీష్ ,రాజులపూడి మహేష్,గుత్తుల పార్ధు,కాంట్రాక్టర్ బాబీ, రాయపురెడ్డి శ్రీనివాసరావు, తవిటికి రాజు, నూకల ఆది వెంకట లక్ష్మి,గుర్రం ధర్మరాజు,డాక్టర్ ఆర్. ప్రకాష్,తదితరులు, పంచాయతీ ఉద్యోగులు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...


Comments
Post a Comment