జీవీఎంసీ కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి సారించండి. • స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు జీవీఎంసీ ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలి. * కోర్టు కేసుల పరిష్కారానికి జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ. -విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు.
విశాఖపట్నం, మార్చి 7: మహావిశాఖ నగరపాలక సంస్థ పై నమోదవుతున్న కోర్టు కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు జీవీఎంసీ ఆస్తుల పరిరక్షణకు నిత్య కృషి చేయాలని, జీవీఎంసీ పై ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి జీవీఎంసీ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పార్టీల ఫ్లోర్ లీడర్లు గంగారాం, గంకల కవిత, బీసెట్టి వసంత లక్ష్మి, జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు , జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, జోనల్ కమిషనర్లు, అధికారులతో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో మేయర్ మాట్లాడుతూ జీవీఎంసీ పై అధిక సంఖ్యలో కోర్టు కేసు దాఖలు అవుతున్నాయని వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించకపోవడం వలన పైకోర్టులను ఆశ్రయించవలసి వస్తుందని ,తద్వారా జీవీఎంసీ కమిషనర్ కు ,అధికారులకు విధులకు ఆటంకం కలుగుతూ సమయం వృధా అవుతుందని అన్నారు. కొన్ని సందర్భాల్లో కమిషనర్ ఎక్కువగా కోర్టుకు స్వయంగా హాజరు కావాల్సి వస్తుందని, నూతనంగా నియమితమైన స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ప్రత్యేక దృష్టి సారించి జీవీఎంసీ పై నమోదవుతున్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించి జీవీఎంసీ అధికారులతో జోనల్ కమిషనర్లతో సంబంధిత కోర్టుల కేసులకు నిర్ణీత సమయంలో కౌంటర్లను దాఖలు చేసి, కేసులను పరిష్కరించి జీవీఎంసీ ఆస్తుల పరిరక్షణకు నిత్యం కృషి చేయాలని కమిషనర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులకు సూచించారు. కౌన్సిల్ తీర్మానం మేరకు ఈ విషయమై ఫ్లోర్ లీడర్లతో, జీవీఎంసీ అధికారులతో కౌన్సిల్ సభ్యులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. జీవీఎంసీ ఖాళీ స్థలాలు, పార్కులు, ఆక్రమణకు గురవుతున్నాయని, షాపులు కళ్యాణ మండపాలు సామాజిక భవనాలు తదితర జీవీఎంసీ ఆస్తులకు సంబంధించిన అద్దెలు ,లీజులపై కోర్టు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వాటిని పరిరక్షించి, కేసులు పరిష్కరించే బాధ్యత స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు పై ఉందని తెలిపారు.అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ పబ్లిక్ హెల్త్ తదితర విభాగాలకు సంబంధించి ఆస్తులు , ఖాళీ స్థలాలు ,పార్కులు, సామాజిక భవనాలు ఆక్రమణకు గురవుతూ, భవన నిర్మాణాలపై అధికంగా కోర్టు కేసులకు గురవుతున్నాయని , అలాగే జీవీఎంసీ షాపులు, కళ్యాణ మండపాలు, మార్కెట్లకు సంబంధించి అద్దెలు, లీజులపై కోర్టు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వాటిని పరిష్కరించేందుకు నూతనంగా నియమితమైన స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ప్రత్యేక దృష్టి సారించి జీవీఎంసీ కేసులను పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. అందుకే ప్రత్యేకించి ఈ సమావేశం అందరితో కలిసి నిర్వహించడం జరిగిందన్నారు. జీవీఎంసీలో ప్రస్తుతం ఉన్న కోర్టు కేసులపై క్షుణ్ణంగా విచారణ జరిపి అధికారులకు ,ఉద్యోగులకు సమావేశం నిర్వహించి ఎంఎస్సీలకు నిర్ణీత సమయంలో కోర్టు కేసులకు సంబంధించి సమాచారం అందించేలా చర్యలు చేపట్టాలని అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మకు కమిషనర్ ఆదేశించారు. జీవీఎంసీ కేసులు త్వరగా పరిష్కరించేందుకు గాను పైకోర్టులు హైకోర్టుల వరకు కేసులు కొనసాగించకుండా ఉండేందుకు జీవీఎంసీ స్థాయిలో ఇండిపెండెంట్గా జ్యుడీషియల్ వ్యవస్థను ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం హాజరైన స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఒక్కొక్కరితో మాట్లాడుతూ వారికి ఇప్పటివరకు అందించిన కేసుల పై కార్యాచరణను అడిగి తెలుసుకుని , ప్రతి కేసుకు సంబంధించి జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో కౌంటర్లను దాఖలు చేయాలని అందుకు సంబంధిత అధికారుల వద్ద వెంటనే సమాచారాన్ని పొంది కేసులు పరిష్కార మార్గానికి నిత్యం కృషి చేయాలని కమిషనర్ వారికి సూచించారు.
అనంతరం సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ బొడ్డు గంగారం మాట్లాడుతూ జీవీఎంసీలో ఉన్న కోర్టు కేసులకు సంబంధించి దీర్ఘకాల సమస్యకు కౌన్సిల్ తీర్మానం వరకు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో,అధికారులతో కోర్టు కేసులపై చర్చ సమావేశం నిర్వహించడం మంచి నిర్ణయమన్నారు. జీవీఎంసీ షాపులకు సంబంధించి అద్దె రెన్యువల్ కాలం పెంచాలని, పార్కులపై ఉన్న కేసులపై దృష్టి సారించాలని, పలు కేసులు జీవీఎంసీ గెలిచినప్పటికీ ఆక్రమణదారులు వాటి ఆక్రమణలకు మరలా దౌర్జన్యం చేస్తున్నారని వాటిపై దృష్టి సారించాలని, మత్స్యదర్శిని, సుబ్బలక్ష్మి నగర్ కల్యాణ మండపం ఆస్తులను కాపాడాలని పేర్కొన్నారు.అనంతరం జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ బీసెట్టి వసంతలక్ష్మి, బిజెపి ఫ్లోర్ లీడర్ గంకల కవిత మాట్లాడుతూ జీవీఎంసీ ఆస్తులను పరిరక్షించేందుకు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా కళ్యాణ మండపాలు, సామాజిక భవనాలు, పార్కులు, షాపుల ఆస్తుల పై ఉన్న కోర్టు కేసులను పరిష్కరించి జీవీఎంసీ ఆస్తులను కాపాడాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు దొడ్డి చంద్రశేఖర్ , పడాల అప్పలరాజు,నాలి శేషు కుమార్ , నీలి పైడిరాజు, లగుజ భారతి, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్, అందరు జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ ఎస్ శ్రీనివాసరావు పిడి-యుసిడి సరోజినీ, కార్యదర్శి బివి రమణ, హార్టికల్చర్ ఆఫీసర్ వాసుకి, డిసిపిలు, ఏసీపీలు, రెవెన్యూ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి ,జివిఎంసి.


Comments
Post a Comment