Skip to main content

మహిళా దినోత్సవం సందర్భంగా “పింక్ సఖి సారీ వాక్” – క్యాన్సర్ అవగాహనకు ప్రత్యేక కార్యక్రమం

 విశాఖపట్నం, మార్చి 8:అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు (08-03-2026) ఉదయం 7:00 గంటలకు విశాఖపట్నం ఆర్‌కే బీచ్ వద్ద “పింక్ సఖి సారీ వాక్” కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ పై మహిళల్లో అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటి మరియు క్యాన్సర్ విజేత గౌతమి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. పి. జగదీశ్వరరావు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది కలిసి సుమారు 300 మంది మహిళలు పింక్ రంగు చీరలు ధరించి ఈ వాక్‌లో పాల్గొన్నారు. ఆర్‌కే బీచ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించింది.క్యాన్సర్ నివారణ, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యత, మహిళల ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.    జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. పి. జగదీశ్వరరావు మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని తెలిపారు.   ఈ కార్యక్రమాన్ని ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. హారిక తన బృందంతో కలిసి సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...