వినియోగదారులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
మార్కెట్‌లో నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు వినియోగదారులకు అందేలా పర్యవేక్షణ మరింత బలోపేతం కావాలని సూచించారు.కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు వికాస్ పాండే సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్,జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు తనూజ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి భాస్కర్ రావు, ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన ఏఎఫ్‌సీ చక్రవర్తి, లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ థామస్ రవికుమార్, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమక్షంలో ప్రముఖ సంఘసేవకుడు కమల్ బైద్ ను శాలువాతో సత్కరించి జ్ఞాపిక బహుకరించారు.

Comments
Post a Comment