హెచ్.పి.వి వ్యాక్సినేషన్ పంపిణిని ప్రారంభించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీఎంస్ ఛైర్మెన్ పెచ్చెట్టి చంద్రమౌళి....
అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం నియోజకవర్గం అమలాపురం రూరల్ పేరూరు గ్రామం ప్రాధమిక అర్యోగ కేంద్రంలో బాలికలకు హెచ్.పి.వి వ్యాక్సినేషన్ ను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీఎంస్ ఛైర్మెన్ పెచ్చెట్టి చంద్రమౌళి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రమౌళి మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్‌ను ఆదిలోనే అరికట్టేందుకు హెచ్.పి. వి టీకా ఎంతో అవసరమని మన పిల్లల ఉజ్వల మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఆడబిడ్డకు నాణ్యమైన వైద్యం అందించడమే మన కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మి, గ్రామ సర్పంచి అరుణ డేవిడ్, మండల తెలుగు దేశం పార్టీ కార్యదర్శి వీరేష్ కుమార్, ముఖ్య జనసేన నాయకులు మోయ్యిల శివ, తెలుగు దేశం నాయకులు దుర్గరావు మరియూ కూటమి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు


Comments
Post a Comment