Skip to main content

పుట్టా మహేష్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి: మాజీ ఎంపీ చింతా అనురాధ... డ్రగ్స్‌ను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం...

అల్లవరం, విశాఖ సందేసం....హైదరాబాద్ శివారులో జరిగిన డ్రగ్స్ పార్టీ ఘటనలో టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని పోలీసులకు పట్టుబడటం రాష్ట్రానికి తీవ్రమైన అవమానమని న అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ తీవ్రంగా విమర్శించారు. టీటీడీ మాజీ చైర్మన్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడైన పుట్టా మహేష్ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీ పదవిలో ఉండి డ్రగ్స్ పార్టీల్లో పాల్గొని డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ రావడం అత్యంత సిగ్గుచేటు ఘటన అని ఆమె అన్నారు. హైదరాబాద్ శివారులోని మాజీ ఎమ్మెల్యే ఫార్మ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారంతో ఈగల్ టీమ్, ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించగా కొకైన్, మద్యంతో పాటు గన్‌ను కూడా స్వాధీనం చేసుకోవడం, మఫ్టీలో ఉన్న పోలీసులపైకి కాల్పులు జరగడం ఈ ఘటన తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోందని తెలిపారు.

డ్రగ్స్‌ను కట్టడి చేస్తామని చెప్పే  టీడీపీ నాయకులు ఇప్పుడు ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని చింతా అనురాధ ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను పూర్తిగా అరికడతామని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆమె నిలదీశారు. స్వయంగా టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకుని పోలీసులకు పట్టుబడటం రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేని ఘటనని పేర్కొన్నారు.

గౌరవప్రదమైన ఎంపీ పదవిలో ఉండి డ్రగ్స్ తీసుకునే వ్యక్తికి పార్లమెంట్‌లో చోటు ఉండదని, వెంటనే ఎంపీ పదవికి తక్షణమే  రాజీనామా చేయాలని పుట్టా మహేష్‌ను డిమాండ్ చేశారు. అలాగే ఆయనను వెంటనే టీడీపీ నుండి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనురాధ డిమాండ్ చేశారు.ఈ ఘటన ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారి రాష్ట్ర పరువును దిగజార్చిందని ఆమె అన్నారు. సొంత ఎంపీలు కూడా డ్రగ్స్ బానిసలుగా మారే పరిస్థితి వస్తే ఆ పార్టీ పాలన గురించి ప్రజలు ఏం అనుకోవాలని ఆమె ప్రశ్నించారు.టీడీపీ అంటే ఇప్పుడు “తెలుగు డ్రగ్స్ పార్టీ”గా పేరు మారిందని అనురాధ తీవ్రంగా విమర్శించారు. డ్రగ్స్‌ను అరికట్టడంలో పూర్తిగా విఫలమైన ఈ కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆమె పేర్కొన్నారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఇందులో ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాజకీయ ప్రభావంతో కేసును దాచిపెట్టే ప్రయత్నాలు చేయకూడదని చింతా అనురాధ డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, డ్రగ్స్ సంస్కృతిని ప్రోత్సహించే రాజకీయాలకు 2029 ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం ఇస్తారని ఆమె హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...