Skip to main content

మతాలన్నీ ఒక్కటే – ప్రేమే మానవతకు మార్గం” *రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఇఫ్తార్ విందు* – పేద ముస్లిం సోదరీమణులకు ‘అమృత కలశం’ సేవ

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశీస్సులతో పవిత్ర రంజాన్ మాస సందర్భంగా, ఆయన బోధించిన “మతాలన్నీ ఒక్కటే – ప్రేమే మానవతకు నిజమైన మార్గం” అనే మహోన్నత సందేశాన్ని స్మరించుకుంటూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖ జిల్లా వారు రంజాన్ పవిత్ర మాసంలో హృదయాన్ని హత్తుకునే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈరోజు ఎం.వి.పి కాలనీ లోని శ్రీ సత్యసాయి ప్రేమసదన్ మందిరంలో, మూడు మసీదులకు చెందిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి, సౌభ్రాతృత్వం మరియు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.

అదే కార్యక్రమంలో భాగంగా, ఆర్థికంగా వెనుకబడిన కొంతమంది ముస్లిం సోదరీమణులకు “అమృత కలశం” (తోఫా) అందజేసి, ప్రేమతో కూడిన సహాయ హస్తాన్ని సత్యసాయి సేవా సంస్థలు చాచాయి. ఈ సేవా కార్యక్రమం భగవాన్ బాబా బోధించిన నిస్వార్థ సేవా భావం మరియు మానవతా విలువలను ప్రతిబింబించింది.


ఈ ఇఫ్తార్ విందులో తారా మసీదు, మొహమ్మదియా మసీదు, ఆల్ మదీనా మసీదు నుండి ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తారా మసీదు ప్రెసిడెంట్ అడ్వకేట్ రజాక్ గారు మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒక్కటే అని, అందరినీ ప్రేమించు -అందరినీ సేవించు అన్న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి సందేశం అందరికీ ఆచరనీయమని, అందరు గురువులు కూడా అదే బోధించారని అన్నారు.

ఎంతో ప్రేమతో ముస్లిం సోదరులను ఇఫ్తార్ విందుకోసం శ్రీ సత్య సాయి ప్రేమ సదన్ కు ఆహ్వానిన్చినందుకు శ్రీ సత్య సాయి సేవా సంస్థలకు ధన్యవాదాలు తెలియచేసారు.

భగవాన్ బాబా వారి శత వర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అల్ ఇండియా మైనారిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సెక్రటరీ డాక్టర్ బాబా, విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు, సిటీ సమితి కన్వీనర్ శ్రీ బి. సాయికుమార్, రాష్ట్ర మరియు జిల్లా పదాధికారులు  సేవాదళ సభ్యులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ముస్లిం సోదరులు నమాజ్ చేశారు. 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు బోధించిన “ప్రేమించు – సేవించు” అనే మహావాక్యాన్ని ఆచరణలో చూపిస్తూ, ఈ కార్యక్రమం మత భేదాలను దాటి మానవతను కలిపే ప్రేమ బంధానికి ప్రతీకగా నిలిచింది.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...