ఈ సందర్భంగా సంఘ ప్రతినిధుల సమావేశం లో ఆర్యవైశ్య యువజన సంఘం కార్యదర్శి శ్రీ నేతి శ్రీనివాస రావు మాట్లాడుతూ భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి ఆధ్యుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు బాధ్యుడు, నిష్కలంక దేశభక్తుడు అయిన శ్రీ పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్య కులమునకు చెందినవారు కావడం మన అదృష్టం అని అన్నారు. పూర్వపు మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించే దిశగా పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అసువులు బాసిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం కార్యదర్శి కట్టమూరి సూర్యనారాయణ మాట్లాడుతూ మహాత్మాగాంధీజీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేశారన్నారు. పొట్టి శ్రీరాములు గారి నిష్కలంక దేశభక్తి, నిరాడంబరమైన జీవితం నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు గారి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం, ఆయన పేరు మీదుగా విశ్వవిద్యాలయం నెలకొల్పడం మరియు ఆయన జయంతి, వర్ధంతి దినములను అధికారికంగా జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడం మరియు ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఏ.పి. రాజధాని ప్రాంతం శాఖమూరి లో 58 అడుగుల కాంస్య విగ్రహం స్థాపించటం మంచి పరిణామం అన్నారు. ఈ సందర్భంగా హాజరైన ఆర్యవైశ్య సంఘం కోశాధికారి శ్రీ దుర్గా నూకేశ్వర రావు తదితరులు పొట్టి శ్రీరాములు శిలా విగ్రహానికి పుష్పమాలంకృతులు చేసి ఘనంగా నివాళులర్పించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కల *వాసవి భవన్"* ప్రాంగణంలో పొట్టి శ్రీరాములు శిలా విగ్రహానికి ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు.

Comments
Post a Comment