Skip to main content

ట్రస్ట్ ఏర్పాటుతో పేద విద్యార్థులు భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు: ఎమ్మెల్యే ఆనందరావు గుబ్బల సత్యనారాయణ మూర్తి మెమోరియల్ ఎస్టియు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారభించిన ఎమ్మెల్యే....

అల్లవరం, విశాఖ సందేసం....అల్లవరం మండలంలోని సత్య కస్తూరి కళ్యాణ మండపంలో  గుబ్బల సత్యనారాయణ మూర్తి మెమోరియల్ ఎస్ టి యు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ను  అమలాపురం శాసన సభ్యులు అయితాబత్తుల ఆనందరావు ఘనంగా ప్రారంబించారు.  గుబ్బల రామ్ ప్రసాద్, ఎస్టియు ఆధ్వర్యంలో నిర్వహించే  సేవ కార్యక్రమాలు, విద్య అభివృద్ధి  లక్ష్యంగా  ఏర్పాటైన ఈ ట్రస్ట్ విద్యా ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్యతిధిగా పాల్గొని  అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే ఆనందరావు  మాట్లాడుతూ దివంగత గుబ్బల సత్యనారాయణ మూర్తి స్మారకార్ధంగా ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ సమాజానికి ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యా సహాయం అందించడం ద్వారా వారి భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు అధిరోహించడం   ఈ ట్రస్ట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన సాధనం అని, విద్య ద్వారా మాత్రమే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి, వారికి అవసరమైన ప్రోత్సాహం మరియు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఇలాంటి చారిటబుల్ ట్రస్టులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విద్యా రంగంలో సేవా కార్యక్రమాలు చేపట్టే సంస్థలు సమాజ నిర్మాణంలో ముఖ్యమైన భాగస్వాములని, గుబ్బల సత్యనారాయణ మూర్తి మెమోరియల్ ఎస్టియు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యా సహాయం, మార్గదర్శక కార్యక్రమాలు అందించడం ద్వారా విద్యా వికాసానికి ట్రస్ట్ దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతికి తమ వంతు సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని కూడా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ట్రస్ట్ స్థాపన ద్వారా విద్యా సేవలను మరింత విస్తరింపజేసేలా కార్యాచరణ చేస్తున్నామని   నిర్వాహకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పెచ్చెట్టి చంద్రమౌళి, దెందుకూరి సత్తిబాబు రాజు, ఇళ్ల శేషగిరిరావు, మూసిగంటి వెంకటేశ్వరరావు  అధికారి జయలక్ష్మి కంకిపాటి వీరబాబు, ఎస్టియు  నాయకులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...